మంగళవారం 26 జనవరి 2021
Health - Nov 30, 2020 , 13:15:53

మరమరాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

మరమరాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

మరమరాలు అందరికీ తెలిసినవే. వీటిని బియ్యపు పేలాలు, పఫ్డ్‌రైస్‌గా పిలుస్తుంటారు. దేశంలో అనేక చోట్ల వీటిని స్కాక్స్‌గా తీసుకుంటుంటారు. మరమరాలను ఉపయోగించి మసాలా, తీపి పదార్థాలను చేసుకొని తినేందుకు జనం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అధిక పీడనంతో బియ్యాన్ని వేడి చేయడం ద్వారా తయారవుతుంటాయి. ఈ ఆరోగ్యకరమైన తృణధాన్యాన్ని తయారు చేయడానికి ఎన్నో పద్ధతులున్నాయి. దాదాపు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇవి ప్రాచుర్యం పొందాయి. అలాగే పొరుగు దేశాలైనా బంగ్లాదేశ్, పాకిస్థాన్లోనూ ప్రసిద్ధి చెందాయి. కానీ, బియ్యం నుంచి తయారైన వీటిలో అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా?.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక కొవ్వు, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం తీవ్ర సమస్యగా మారింది. ఒక వ్యక్తి కేవలం జంక్ ఫుడ్ మాత్రమే తిన్నట్లయితే, అందులోని కొవ్వు పదార్థాలతో జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీంతో పొట్ట ఉబ్బి.. మలబద్దకం సమస్య ఉత్పన్నమవుతుంది. మరమరాలలో ఉండే స్థిరత్వం, లాభదాయకమైన బ్యాక్టీరియా మలబద్దకం సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది. 

రక్తపోటును నియంత్రిస్తుంది..


పెరుగుతున్న వయస్సుతో, చాలా మంది హైబీపీ, లో బీపీ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక వ్యక్తి రక్తపోటు స్థిరంగా ఉండాలి. ఎందుకంటే, అనియంత్రిత లేదా అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశాన్ని పెంచుతుంది. వైద్యులు సూచించిన మందులే కాకుండా, మీ రక్తపోటును నియంత్రించుకునేందుకు మరమరాలు తీసుకోవచ్చు.

బరువునూ తగ్గిస్తుంది


మరమరాలు చాలా తేలినకైన ఆహారం. చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఇవి మీకు సహాయపడుతాయి. తేలికపాటి స్నాక్స్ తినడంతో పాటు మీరు ఖచ్చితంగా కొన్ని శారీరక శ్రమ చేస్తే కొలోస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. తృణధాన్యాలు మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించే ప్రక్రియను వేగం చేస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది


ఈ పఫ్డ్ రైస్ మీ జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. 100 గ్రాముల మరమరాలు తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్ అందుతుంది. రోజూ మంచి మొత్తంలో ఫైబర్ తీసుకోవడం వల్ల మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కూడా ఆహార పదార్థాలను అందించే గొప్ప శక్తి. మీ జీర్ణ వ్యవస్థ అనేది ఒక అధునాతన యంత్రం. ఇది ఆహారాన్ని శోషించుకుంటుంది. మీకు పోషకాలు, శక్తి వనరులు సమృద్ధిగా ఉండే వాటిని అందిస్తుంది. వాటితో మీ కడుపు, శరీరం దాని నుంచి ప్రయోజనం పొందుతాయి. 

ఎముకలకు బలం