శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Aug 04, 2020 , 16:56:09

పైల్స్‌తో బాధ‌ప‌డేవారికి శుభ‌వార్త‌! బిల్వ చెట్టు వేర్ల‌తో ఔష‌ధం

పైల్స్‌తో బాధ‌ప‌డేవారికి శుభ‌వార్త‌! బిల్వ చెట్టు వేర్ల‌తో ఔష‌ధం

పైల్స్‌తో బాధ‌ప‌డేవారి ప‌రిస్థితి వ‌ర్ణ‌ణాతీతం. చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి వారి బాధ‌ను త‌గ్గించేందుకే బిల్వ చెట్టు వేర్లు స‌హాయ‌ప‌డుతాయి. అంతేకాదు వీటి వేర్ల‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలున్నాయి. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఈ రోజుల్లో పైల్స్ స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. అందుకే బిల్వ చెట్టు వేర్ల‌ను బాగా రుబ్బాలి. దీంట్లో కొంచెం చ‌క్కెర మిఠాయిని పొడి చేసి క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యం, సాయంత్రం స‌మ‌యాల్లో చ‌ల్ల‌ని నీటిలో క‌లుపుకొని తాగిలి. లేదు నొప్పి ఎక్కువ‌గా ఉందంటే మూడుసార్లు తాగినా ప‌ర్వాలేదు. దీంతో పైల్స్ నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వచ్చు. 

* శ‌రీరంలో వేడి ఎక్కువైతే నోటిలో పుండ్లు, బొబ్బ‌లు ఏర్ప‌డుతాయి. ఇలా ఉన్న‌ప్పుడు నోటిలో బిల్వ ప‌త్రాలు వేసుకొని బాగా న‌మ‌లాలి. ప్ర‌తిరోజూ ఇలా న‌ములుతూ ఉంటే బొబ్బ‌లు, పండ్లు త‌గ్గిపోతాయి. 

* వ‌ర్షాలు మొద‌లైన‌ప్ప‌టి నుంచి జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి వ్యాధుల బారిన ప‌డుతూనే ఉంటాం. ఇప్పుడు హాస్పిట‌ల్‌కు వెళ్లి వ్యాధిని త‌గ్గించుకోవాల్సిన ప‌నిలేదు. బిల్వ ప‌త్రాల‌తో క‌షాయం చేసుకొని తాగితే స‌రిపోతుంది. 

* ఎప్ప‌టికీ గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే బిల్వ ప‌త్రాల క‌షాయం మంచి ఫ‌లితాన్నిస్తుంది. ప‌త్రాల వాడ‌కం గుండె రోగుల‌కు మేలు చేస్తుంది. దీంతో గుండె బ‌లంగా ఉంటుంది. ఈ ర‌సంతో శ్వాస స‌మ‌స్య‌లు చాలావ‌ర‌కు త‌గ్గుతాయి.  

* చిన్న‌పిల్ల‌ల‌కు క‌డుపు నొప్పి, విరేచ‌నాలు, పేగు పురుగులు వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి వెనిగ‌ర్ ర‌సం తాపించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. 

 


logo