శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Aug 26, 2020 , 16:20:57

ఉద‌యాన్నే ఈ పండుని తింటే కిడ్నీలు పాడ‌వ‌కుండా చూసుకుంటుంది!

ఉద‌యాన్నే ఈ పండుని తింటే కిడ్నీలు పాడ‌వ‌కుండా చూసుకుంటుంది!

దైనంద‌న జీవితంలో ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్ తిన‌డానికి కూడా స‌మ‌యం ఉండ‌డంలేదు. దీనివ‌ల్ల చాలామంది అనారోగ్యానికి గుర‌వుతున్నారు. సంపాదించేది మూడుపూట‌ల ఆహారం తిన‌డం కోస‌మే అన్న విష‌యం మ‌ర్చిపోతున్నారు. మ‌రికొంద‌ర‌యితే డైట్ అంటూ పొట్ట మాడ్చుకుంటున్నారు. ఇలా కార‌ణం ఏదైనా గాని ఉద‌యం మాత్రం బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తున్నారు. అలా చేయ‌కుండా కొంచెం టైం కేటాయించి ఈ బొప్పాయి పండుని తినండి చాలు. ఆరోగ్యానికి ఆరోగ్యం. అందానికి అందం. ఏది కావాల‌న్నా అన్నీ బొప్పాయిలో దాగున్నాయి.

* బొప్పాయి పండులో ఫైటో కెమిక‌ల్స్‌, యాంటీ-ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని ప‌దిలంగా కాపాడుతాయి.

* ఇందులో మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. 

* ప్ర‌తిరోజూ బొప్పాయి తిన‌డం వల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది. కార్నియాని ప్రొటెక్ట్ చేసి రెటీనా డీజెన‌రేట్ అవ్వ‌కుండా కాపాడుతుంది.

* ఇమ్యునిటీ బూస్ట్‌ని పెంచేందుకు బొప్పాయి ఎంతో తోడ్ప‌డుతుంది. ఇందులో పుష్క‌లంగా దొరికే విట‌మిన్ సి ఇన్‌ఫెక్ష‌న్స్‌తో పోరాడుతుంది. 

* బొమ్మాయి తిన‌డం వ‌ల్ల చ‌ర్మం రంగు మెరుగుప‌డుతుంది. అంతేకాదు చ‌ర్మం సాగిపోకుండా, ముడ‌త‌లు ప‌డ‌కుండా కాపాడుతుంది.

* బ‌రువు త‌గ్గాల‌ని త‌పించేవాళ్లు డైట్‌లో బొప్పాయిని చేర్చుకోండి. ఇందులో క్యాల‌రీస్ త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

* బొప్పాయి తిన‌డం వ‌ల్ల క‌డుపు నిండి ఎక్కువ‌సేపు ఆక‌లి కాకుండా చూస్తుంది. 

* కిడ్నీల్లో చేరుకున్న టాక్సిన్స్‌ని బ‌య‌ట‌కు పంపేందుకు బొప్పాయి ఎంతో సాయ‌ప‌డుతుంది.

*  షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డేవాళ్లు ఎలాంటి సందేహాలు లేకుండా బొప్పాయి పండుని తీసుకోవ‌చ్చు. ఇందులో లో గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి కాబ‌ట్టి తిన్నా కూడా ఏం కాదు. 


logo