సోమవారం 13 జూలై 2020
Health - Jun 11, 2020 , 15:41:21

గ్రీన్ యాపిల్స్‌‌ తినండి.. ఎవర్‌గ్రీన్‌గా ఉండండి!

గ్రీన్ యాపిల్స్‌‌ తినండి.. ఎవర్‌గ్రీన్‌గా ఉండండి!

సాధారణంగా మనలో చాలా మందికి ఎరుపు రంగులో ఉండే యాపిల్స్ మాత్రమే తెలుసు. కానీ గ్రీన్ కలర్‌లోనూ యాపిల్స్ ఉంటాయని కొందరికి తెలియదు. ఎరుపు రంగు యాపిల్స్ లాగే గ్రీన్ కలర్ యాపిల్స్ కూడా మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క్రమంలోనే గ్రీన్ యాపిల్స్‌ను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గ్రీన్ యాపిల్స్‌ను తినడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేసే అంశం. వారిలో మెటబాలిజం సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు వారు గ్రీన్ యాపిల్స్‌ను తింటే థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే ఇతరులు కూడా గ్రీన్ యాపిల్స్‌ను తినడం వల్ల గాడి తప్పిన మెటబాలిజం ఒక దారిలోకి వస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది.

2. గ్రీన్ యాపిల్స్‌లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఈ యాపిల్స్‌ను తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది.

3. గ్రీన్ యాపిల్స్‌లో ఉండే విటమిన్ ఎ, సిలు చర్మ కణాలను నాశనం కాకుండా చూస్తాయి. అలాగే చర్మ క్యాన్సర్ రాకుండా చూస్తాయి. దీంతోపాటు కంటి చూపు కూడా పెరుగుతుంది. అలాగే గ్రీన్ యాపిల్స్‌లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తుంది.

4. గ్రీన్ యాపిల్స్‌ను తరచూ తినేవారిలో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. గ్రీన్ యాపిల్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

5. డయాబెటిస్, ఆస్తమా ఉన్నవారు గ్రీన్ యాపిల్స్‌ను తింటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అల్జీమర్స్ రాకుండా చూసే ఔషధ గుణాలు కూడా గ్రీన్ యాపిల్స్‌లో ఉంటాయి.


logo