గురువారం 29 అక్టోబర్ 2020
Health - Sep 22, 2020 , 16:49:09

ఆప‌రేష‌న్ త‌ర్వాత 'అల్లం' త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి! ఎందుకంటే..

ఆప‌రేష‌న్ త‌ర్వాత 'అల్లం' త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి! ఎందుకంటే..

ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను ఎంత‌గానే పెంచే అల్లం ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌కు కూడా ఎంతో తోడ్ప‌డుతుంది.  అల్లం చెట్టు ఇంట్లో ఉంటే అటు ఆరోగ్యంతో పాటు హోమ్‌డెక‌రేష‌న్‌కు కూడా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. క‌రోనా నేప‌థ్యంలో అంద‌రూ ఆరోగ్యం మీద ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నారు. అందులో అల్లం ప్ర‌ధాన‌మైన‌ది. ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను పెంచ‌డ‌మే కాకుండా అల్లంతో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలున్నాయి. మ‌రి అవేంటో తెలుసుకొని అల్లాన్ని ఉప‌యోగించుకోండి. 

* మ‌న పూర్వీకులు ప్ర‌తి చిన్న జ‌బ్బుకు అల్లాన్ని ఉప‌యోగించేవాళ్లు. అంటే.. జ‌లుబు, ఫ్లూ, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఏం వ‌చ్చినా అల్లం టీ త‌యారు చేసి తాగేస్తారు. ఇది చాలా ఫేమ‌స్‌. అల్లం టీ క‌డుపులో ప‌డితే అంత స‌ర్దుకుంటుంది.

* ఉద‌యం లేవ‌గానే బ‌ద్ద‌కంగా, బారంగా అనిపిస్తుందా. దీన్నే మార్నింగ్ సిక్‌నెస్ అంటారు. దీన్ని పోగెట్టేందుకు అల్లం టీ భేష్‌గా ప‌నిచేస్తుంది. ఇది క్యాన్స‌ర్ కీమోథెర‌పీ వ‌ల్ల వ‌చ్చే వికారాన్ని కూడా త‌గ్గిస్తుంది.

* మ‌హిళ‌లకు పీరియ‌డ్ స‌మ‌యంలో వ‌చ్చే క‌డుపునొప్పి నుంచి విముక్తి పొందేందుకు అల్లం స‌హాయ‌ప‌డుతుంది. 

* అల్లం ఇన్‌ఫ్ల‌మేష‌న్‌ని త‌గ్గిస్తుంది.

* కొంత‌మందికి ఆక‌లి ఎక్కువ‌గా ఉండ‌టంతో తింటూనే ఉంటారు. మ‌రికొంత‌మందికి అస‌లు ఆక‌లి అవ్వ‌డం లేదంటే త‌ల‌కొట్టుకుంటుంటారు. ఆక‌లి అయ్యేందుకు అల్లం బాగా ప‌నిచేస్తుంది.

* క్యాన్స‌ర్ పేషంట్ల‌కు కీమోథెర‌పీ చేస్తారు. ఈ ట్రీట్‌మెంట్ వ‌ల్ల వికారంగా ఉంటుంది. వీరికి అల్లం బాగా ప‌నిచేస్తుంది.

* అధిక బ‌రువు ఉండేవారిలో కొలెస్ట్రాల్‌ను త‌గ్గించేందుకు అల్లం ఉప‌యోగ‌ప‌డుతుంది.

* తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌డానికి అల్లం హెల్ప్ చేస్తుంది. 

* ఎసిడిటీ, కాన్ట్సిపేష‌న్ వంటి స‌మ‌స్య‌ల నుంచి రిలీఫ్‌నిస్తుంది.

* కీళ్ల‌నొప్పుల‌తో బాధ‌ప‌డేవాళ్లు త‌ర‌చూ అల్లం ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పుల నుంచి విముక్తి పొందుతారు.

* క‌రోనా టైంలో నోటికి సంబంధించిన ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ద‌రిచేర‌నివ్వ‌కూడ‌దు. ఒక‌వేళ దంతాల స‌మ‌స్య‌లు బాధ‌పెడుతుంటే దీనికి అల్లం మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

* ముఖ్యంగా మ‌హిళ‌లు ఏదైనా స‌ర్జ‌రీ చేసిన‌ట్ల‌యితే వారు అల్లాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌ర్జ‌రీ నుంచి త్వ‌ర‌గా కోలుకునేలా చేస్తుంది. 

* గ్యాస్ ప్రాబ్ల‌మ్స్ ఉన్న‌వారికి అల్లం ప‌డ‌దు అంటారు. అంటే.. ఎక్కువ మోతాదులో కాకుండా త‌క్కువ మోతాదులో తీసుకుంటే గ్యాస్ ప్రాబ్ల‌మ్‌ని క్యూర్ చేస్తుంది. 


logo