శనివారం 27 ఫిబ్రవరి 2021
Health - Jan 24, 2021 , 21:07:36

కలబంద డయాబెటిస్‌కు వరం లాంటిదా.. ఎందుకు?

కలబంద డయాబెటిస్‌కు వరం లాంటిదా.. ఎందుకు?

జీవనవిధానం మారుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. శరీరాన్ని పీడించే జబ్బులూ ఎక్కువవుతుంటాయి. అవి ప్రధానంగా మనం చేసే పనిమీదే ఆధారపడి ఉంటుంది. వీటిల్లో చాలా కామన్‌గా ఎఫెక్ట్ అయ్యేది డయాబెటిస్. బ్లడ్ షుగర్ లెవల్‌ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో డయాబెటిస్ వస్తుంది. సాధారణంగా షుగర్ ఫ్లక్చుయేషన్ నార్మల్‌గా అనిపించినా.. అది శరీరంపై చాలా ప్రభావం చూపిస్తుంది. సరైన సమయానికి కనుగొని కంట్రోల్ చేసుకోలేకపోతే చిక్కులు తప్పవు. 

ప్రస్తుత కాలంలో షుగర్‌కు మెడికేషన్ చాలా సులభం అయ్యింది. నిజానికి మెడిసిన్ తీసుకోవడం కంటే.. ఆహార పద్ధతులు పాటించడం వల్ల కంట్రోల్ చేసుకోవడం చాలా ఉత్తమం. అలా పనిచేయడంలో కలబంద కరెక్ట్ మొక్క. ఇది రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్‌ను  సుభంగా కంట్రోల్ చేస్తుంది. 

1. కలబంధ తీసుకుంటే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

2. అలోవెరా జ్యూస్‌తో లేదా జెల్‌తో బ్లడ్ గ్లూకోజ్ లెవల్ సహజంగా తగ్గుతుంది. దీన్ని పరిగడుపున తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్‌ చాలా తక్కువ సమయంలో కంట్రోల్ అవుతుంది. 

3. కలబంద శరీరంలోని కొవ్వు, బరువు తగ్గించేందుకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.

4. కలబంద తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లు అత్యంత అల్పమని నిపుణులు చెబుతున్నాయి. 

5. అన్ని రకాల డయాబెటిస్ రోగులు కలబంద తీసుకోవచ్చు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo