ఆవనూనెతో అద్బుతాలెన్నో..


Sun,April 22, 2018 11:07 PM


పోపు దినుసుగా ఆవాలు ఎంతో మంచిచేస్తాయి. అదే ఆవాలను నూనె పట్టించి వాడితే అద్భుతాలే జరుగుతాయి. చర్మ సంరక్షణకు అధికంగా వాడే ఆవనూనె ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

* చర్మంపై పీహెచ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తూ నూనెను నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ నూనె. దీంట్లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి దూదితో యాక్నే ఉన్న చోట ఐప్లె చేయాలి. తద్వారా యాక్నే, మచ్చల నుంచి రక్షణ పొందవచ్చు.

* ఒక స్ప్రే బాటిల్‌లో మస్టర్డ్ ఆయిల్, రోజ్‌వాటర్‌ని తీసుకోవాలి. వీటిని బాగా షేక్ చేసి ఫేస్ పై టోనర్‌లా ఉపయోగించాలి. మాయిశ్చరైజర్‌ని ఐప్లె చేసుకునే ముందు ఈ స్ప్రేని వాడాలి. దీనిని ప్రతిరోజూ వాడితే మంచి ఫలితం ఉంటుంది.

* నిద్ర పోయే ముందు ప్రతిరోజూ మస్టర్డ్ ఆయిల్‌ను పెదవులకు అప్లై చేసుకోవాలి. వీలైతే బీట్‌రూట్‌ని ఎండబెట్టి పొడి చేసి ఈ నూనెలో కలిపి పెదవులకు రాస్తే ఎర్రని పెదవులను సొంతం చేసుకోవచ్చు.

* ఆవనూనె.. మేకప్ రిమూవర్‌గా కూడా పనిచేస్తుంది. ట్యాన్ అరికట్టేందుకు ఈ ఆయిల్‌లో నిమ్మరసం, శనగపిండితో కలిపి పేస్ట్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

* డ్రై, డ్యామెజ్డ్ హెయిర్ సమస్యల నుంచే కాదు..కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలను తొలిగించడానికి మస్టర్డ్ ఆయిల్‌ను రాసుకుంటే మంచిది.

4003

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles