జ‌లుబు, ద‌గ్గును త‌గ్గించే ఇంటి చిట్కాలు..!


Mon,September 3, 2018 11:27 AM

సీజ‌న్ మారిన‌ప్పుడ‌ల్లా జ‌లుబు, దాని వెంటే ద‌గ్గు వ‌స్తుంటాయి. ఇవి రెండూ వ‌చ్చాయంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. మ‌రోవైపు ఏ ప‌నిచేయాల‌న్నా అసౌక‌ర్యంగా ఉంటుంది. అయితే కింద సూచించిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే జ‌లుబు, ద‌గ్గుల నుంచి స‌త్వ‌ర‌మే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వెల్లుల్లి రెబ్బ‌లు కొన్ని తీసుకుని వాటిని బాగా నలపాలి. ఈ మిశ్రమాన్ని గంటకొకసారి బాగా వాసన పీలుస్తూ, 6 గంటలకొకసారి కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల్ని నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జలుబు త్వరగా తగ్గుతుంది.

2. ఒక గ్లాసు బార్లీ నీటిలో కొంత నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగితే జలుబు, గుండెల్లో మంట తగ్గుతాయి.

3. వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని రాత్రి తాగితే తెల్లవారే సరికి జలుబు మాయమవుతుంది.

4. ఉదయాన్నే వేడి వేడి పాలలో మిరియాల పొడి (వీలుంటే శొంఠి) వేసి బాగా కలిపి తాగితే జలుబు తగ్గుతుంది.

5. తులసి, అల్లం రసం, తేనెలను కలిపి మూడు పూటల సేవిస్తే జలుబు తగ్గుతుంది.

6. శొంఠి, మిరియాలు, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకుని కషాయం తయారు చేయాలి. దానికి చక్కెర కలిపి వేడిగా తాగితే ముక్కు దిబ్బడ, జలుబు వంటివి తగ్గుతాయి.

7. ఇరవై గ్రాముల దాల్చిన చెక్క పొడి, చిటికెడు మిరియాల పొడిలను ఒక గ్లాసు నీటితో మరిగించి, వడకట్టి, ఒక చెంచా తేనెను దానికి కలిపి వేడిగా తాగితే ఫలితం ఉంటుంది.

8. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, 2 చెంచాల తేనెను దానికి కలిపి, రోజూ పరగడుపున తాగితే నిమ్మలోని సి విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా జలుబు తగ్గేలా చేస్తుంది.

9. తులసి ఆకుల రసాన్ని రోజుకు 3 పూటలా సేవిస్తే జలుబు తగ్గుతుంది.

5428

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles