మ‌ల‌బ‌ద్దకాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!


Tue,December 4, 2018 12:26 PM

స్థూల‌కాయం, థైరాయిడ్‌, షుగ‌ర్ స‌మ‌స్య‌లు, ఇత‌ర అనారోగ్యాలు, ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ప‌నిచేయ‌డం, ఆహార‌పు అల‌వాట్లు.. తదిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల నేటి త‌రుణంలో చాలా మంది మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి టాయిలెట్‌లో త‌ప‌స్సు చేసినా సుఖ విరేచ‌నం కాదు. దీంతో రోజంతా అసౌక‌ర్యంగా ఉంటుంది. ఆ అవ‌స్థను భ‌రించే వారికే త‌ప్ప ఇత‌రుల‌కు చెప్పినా అర్థం కాదు. అయితే కింద చెప్పిన చిట్కాలు, సూచ‌న‌ల‌ను పాటిస్తే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి చాలా త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు, సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రోజు మొత్తంలో తాగాల్సిన నీటిని తాగ‌క‌పోయినా మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది. క‌నుక నిత్యం త‌గినంత మోతాదులో నీటిని క‌చ్చితంగా తాగాలి. ముఖ్యంగా ఉద‌యాన్న లేచిన వెంట‌నే రోజూ 1 లీట‌ర్ నీటిని తాగితే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉండ‌దు. విరేచ‌నం సాఫీగా అవుతుంది.

2. తినే ఆహారంలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. పీచు ప‌దార్థాలు ఉన్న ఆహారాల‌ను తింటే మ‌ల‌బ‌ద్ద‌కం రాదు. ఆకుకూర‌లు, తాజా కూర‌గాయ‌లు, పండ్లు తినాలి. ముఖ్యంగా అరటి, జామ పండ్ల‌ను రోజూ తింటే ఫ‌లితం ఉంటుంది. అలాగే పైనాపిల్‌, సంత్రా, స‌పోట పండ్ల‌ను కూడా తిన‌వ‌చ్చు.

3. నూనె ప‌దార్థాలు, మ‌సాలాలు, వేపుళ్లు మానేయాలి. మ‌ద్య‌పానం, ధూమ‌పానం మానేయాలి.

4. టీ, కాఫీల‌ను తాగ‌డం త‌గ్గించాలి. నిల్వ ఉంచిన ఊర‌గాయ‌ల‌ను అతిగా తిన‌కూడ‌దు. కారంగా ఉన్న ప‌దార్థాల‌ను కూడా త‌క్కువ‌గా తినాలి.

5. ప్రతి రోజూ ఒక గ్లాస్‌ క్యారట్ జ్యూస్ లేదా క్యాబేజీ రసం, ద్రాక్షరసం, బీట్ రూట్ రసం తాగితే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

6. ట‌మాటా రసంలో ఉప్పు, మిరియాల పొడి త‌గినంత‌గా కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే సేవిస్తే మలబద్ధకం, అజీర్తితో పాటు గ్యాస్ వల్ల కలిగే మంట కూడా తగ్గుతుంది.

7. తమలపాకులో పచ్చ కర్పూరం, కొంచెం మంచి గంధం, కొద్దిగా వెన్న వేసి చుట్టి నమిలి, ఆ రసాన్ని మింగితే మంచి ఫలితముంటుంది.

8. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా త్రిఫలా చూర్ణం నీళ్లలో కలుపుకుని తాగాలి.

9. అల్లం, స్వచ్ఛమైన బెల్లం ఒక్కోటి 5 గ్రాములు తీసుకుని రెండూ కలిపి ర్రాతి పడుకోబోయే ముందు నమిలి తినాలి. దీంతో మ‌రుస‌టి రోజు సుఖ విరేచ‌నం అవుతుంది.

3924

More News

VIRAL NEWS