చెర్రీ పండ్లను తింటే కలిగే అద్భుతమైన లాభాలివే తెలుసా..!


Mon,June 25, 2018 03:32 PM

ఎరుపు రంగులో చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే చెర్రీ పండ్లంటే అందరికీ ఇష్టమే. వీటిని ఎవరైనా ఇష్టంగానే తింటారు. అంతటి అమోఘమైన రుచిని ఈ పండ్లు మనకు ఇస్తాయి. అయితే కేవలం రుచికి మాత్రమే కాదు, చెర్రీ పండ్లు పోషకాలకు కూడా పెట్టింది పేరు. ఈ పండ్లలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటితో పలు అనారోగ్య సమస్యలను సులభంగా నయం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్నో అనారోగ్యాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. మరి చెర్రీ పండ్లను తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. అలాగే చెర్రీ పండ్లలో ఉండే మెలటోనిన్ నొప్పులు, వాపులను తగ్గిస్తుంది.

2. చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కనుక కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

3. చెర్రీ పండ్లలో ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్త నాళాలు గట్టిపడకుండా ఉంటాయి.

4. చెర్రీ పండ్లలో పుష్కలంగా ఉండే మెలటోనిన్ మనకు ఉండే నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. నిద్ర చక్కగా పట్టేలా చేస్తుంది. నిత్యం గుప్పెడు చెర్రీ పండ్లను తింటే నిద్ర సమస్యలు పోతాయి.

5. చెర్రీ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

6. చెర్రీ పండ్లను తరచుగా తినే వారు ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు. ఎందుకంటే వాటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ సి లు చర్మాన్ని ముడతలు పడకుండా చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

7. చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. ముఖ్యంగా మలబద్దకం ఉండదు.

8. డయాబెటిస్ ఉన్నవారు కూడా చెర్రీ పండ్లను నిర్భయంగా తినవచ్చు. వాట్లిలో ఉండే ఆంథోసయనిన్స్ ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అందువల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

3866

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles