డ‌యాబెటిస్‌కు చెక్ పెట్టే మున‌గ ఆకులు..!


Sat,October 6, 2018 06:40 PM

మున‌గ కాయ‌లను మ‌నం త‌ర‌చూ కూర‌ల్లోనో, చారులోనో తింటూనే ఉంటాం. దీంతో మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే కేవ‌లం మున‌గ కాయ‌లే కాదు, మున‌గ చెట్టు ఆకుల వ‌ల్ల కూడా మ‌నం ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మున‌గ చెట్టు ఆకుల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. దీంతోపాటు విట‌మిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విట‌మిన్ బి2, ఐర‌న్‌, మెగ్నిషియం వంటి ముఖ్య‌మైన పోష‌క ప‌దార్థాలు మున‌గ ఆకుల్లో పుష్క‌లంగా ఉన్నాయి. నిత్యం మున‌గ ఆకును మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ముందు చెప్పిన పోష‌కాల‌న్నీ మ‌న‌కు అందుతాయి.

2. మున‌గ చెట్టు ఆకుల‌ను నిత్యం కూర‌, లేదా ర‌సం రూపంలో ఏదో ఒక విధంగా తీసుకున్న‌ట్ట‌యితే దాంతో శ‌రీరానికి కాల్షియం, ఐర‌న్ పుష్క‌లంగా అందుతాయి. దీంతో ఎముక‌లకు బ‌లం చేకూరుతుంది. అవి దృఢంగా మారుతాయి.

3. మున‌గ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్స‌ర్‌లు దూర‌మ‌వుతాయి. క‌ణ‌జాలాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి. విట‌మిన్ సి, బీటా కెరోటిన్‌లు కూడా ఉండ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ కార‌క ప‌దార్థాలు నాశ‌న‌మ‌వుతాయి.

4. మున‌గ చెట్టు వేళ్ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిని జ్యూస్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే త‌ల‌నొప్పి మాయ‌మ‌వుతుంది.

5. కొన్ని మున‌గ ఆకుల‌ను తీసుకుని పేస్ట్‌లా చేసి దానికి కొంత తేనెను క‌లిపి కంటి రెప్ప‌ల‌పై పెట్టుకుంటే నేత్ర సంబంధ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. దృష్టి బాగా ఉంటుంది. కంటి వాపు కూడా త‌గ్గుతుంది. కురుపులు న‌య‌మ‌వుతాయి.

6. మున‌గ చెట్టు ఆకుల‌ను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో మధుమేహం ఉన్న వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది.

7. మున‌గ చెట్టు ఆకుల్లో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉంటాయి. ఈ ఆకుల‌కు చెందిన ర‌సాన్ని నిత్యం కొంత మోతాదులో తాగుతున్న‌ట్ట‌యితే ర‌క్తం శుద్ధి అవుతుంది. అందులో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి.

8. మున‌గాకు ర‌సాన్ని తాగితే వృద్ధాప్యం కార‌ణంగా శ‌రీరంపై వ‌చ్చే ముడ‌తలు పోతాయి. యాంటీ ఏజింగ్ గుణాలు ఈ ఆకుల్లో పుష్క‌లంగా ఉంటాయి.

8126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles