రోజూ ప‌ర‌గ‌డుపునే లెమ‌న్ వాట‌ర్ తాగితే..?


Thu,January 25, 2018 10:15 AM

నిమ్మ‌కాయ‌లో ఎన్ని ఔష‌ధ గుణాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. ఇందులో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. దీంతోపాటు నిమ్మ‌కాయ‌ల్లో ఉండే ప‌లు ఇత‌ర పోష‌కాలు కూడా మ‌న ఆరోగ్యానికి దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది నిమ్మ‌కాయ‌ను రోజూ ఏదో ఒక విధంగా ఉప‌యోగిస్తుంటారు. కూర‌ల్లో, డ్రింక్స్‌లో దీన్ని వాడుతారు. అయితే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తి పిండి ఆ మిశ్ర‌మాన్ని తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జీర్ణాశయ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో లెమన్ వాటర్ బాగా పనిచేస్తుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది.

2. నిమ్మలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

3. ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఆ రోజుకు కావల్సినంత విటమిన్ సి మనకు అందుతుంది. ఇందులో ఫోలేట్ కూడా అధికంగా ఉంటుంది. దీంతోపాటు పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.

4. నిమ్మలో అధికంగా ఉండే మినరల్స్ శరీరంలో ఆల్కలైజింగ్ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. మలబద్దకం తొలగిపోతుంది. డయేరియా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మాన్ని సంరక్షించే గుణాలు నిమ్మలో ఉన్నాయి.

5. ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడం వల్ల ఇది యాంటీ కార్సినోజెనిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు నిమ్మలో ఉన్నాయి.

6. లివర్ పనితనం మెరుగు పడుతుంది. గొంతు ఇన్‌ఫెక్షన్ల వంటివి తొలగిపోతాయి. శరీరంలో పేరుకుపోయే మ్యూకస్, ప్లీహాన్ని తొలగిస్తుంది.

7. బరువు తగ్గాలనుకునే వారికి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. కొవ్వును కరిగించే గుణాలు నిమ్మలో ఉన్నాయి.

8. నోటి నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి.

9935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles