రాత్రి నిద్రించడానికి ముందు ఇలా చేస్తే.. బరువు తగ్గడం ఖాయం..!


Wed,January 3, 2018 03:55 PM

యోగా, జిమ్, ఇతర వ్యాయామాలు చేయడం.. రోజూ సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం.. తగినంత నిద్ర పోవడం.. ఈ లైఫ్ స్టైల్ ను ఎవరైనా పాటిస్తే చాలు, దాంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. అయితే కేవలం ఇవే కాకుండా రాత్రి పూట నిద్రించడానికి ముందు కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాని వల్ల కూడా అధిక బరువును మరింత ఎఫెక్టివ్‌గా తగ్గించుకోవచ్చు. మరి రాత్రి నిద్రకు ముందు చేయాల్సిన ఆ పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రాత్రి పూట నిద్రించడానికి ముందు ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి తాగాలి. దీంతో కొవ్వు కరిగే హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి. అవి బరువును తగ్గిస్తాయి.

2. రోజూ రాత్రి పూట ఒకే సమయానికి నిద్రించండి. దీంతో ఆ రొటీన్‌కు మీ శరీరం అలవాటు పడుతుంది. ఫలితంగా హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

3. రాత్రి పూట నిద్రించడానికి 30 నిమిషాల ముందు తేలికపాటి వార్మప్స్ చేయండి. ఇవి చక్కని నిద్రను అందిస్తాయి. అంతేకాదు, మనం నిద్రపోయినా శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది.

4. గది ఉష్ణోగ్రత వీలున్నంత చల్లగా ఉండేలా చూసుకోండి. దీంతో శరీరం వేడిగా ఉండేందుకు క్యాలరీలను ఖర్చు చేస్తుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు.

5. రాత్రి పూట నిద్రించడానికి 30 నిమిషాల ముందు స్నానం చేయండి. దీంతో శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. ఇది రిలాక్సేషన్‌ను అందిస్తుంది. అంతేకాదు కొవ్వు కరిగేందుకు సహాయ పడుతుంది.

6. రాత్రి పూట బెడ్‌పై పడుకోగానే మొబైల్స్ వంటి గ్యాడ్జెట్లకు స్వస్తి చెప్పండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి గాఢ నిద్రలోకి జారుకోండి. నిద్ర ఎంత ఎక్కువగా పోతే అంత ఎక్కువగా క్యాలరీలు ఖర్చవుతాయి. నిద్ర లేమితో బరువు పెరుగుతారు.

7. రాత్రి పూట శృంగారంలో పాల్గొన్నాక నిద్రిస్తే మరిన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. కనుక శృంగారాన్ని ఓ దైనందిన కార్యక్రమంగా భావిస్తే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

8. రాత్రి పూట మన శరీరానికి ఎక్కువ ఆహారం అవసరం లేదు. కనుక తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని స్వల్పంగా తీసుకున్నా చాలు, దాంతో శరీరం శక్తికి కొవ్వుపై ఆధార పడుతుంది. ఫలితంగా కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

7398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles