మంగళవారం 26 జనవరి 2021
Health - Dec 04, 2020 , 17:13:53

ప‌ల్లినూనెతో బోలెడ‌న్ని లాభాలు!

ప‌ల్లినూనెతో బోలెడ‌న్ని లాభాలు!

వేరుశెనగ నూనె తెలంగాణ వాడుక భాష‌లో ప‌ల్లినూనె ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని నిపుణులు సెల‌విస్తున్నారు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యాన్ని కాపాడటం మొద‌లుకొని క్యాన్సర్ నిరోధించడానికి, నాడీ వ్యవస్థ మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటానికి, రక్తపోటును తగ్గించటానికి, చర్మాన్ని రక్షించ‌టానికి ప‌ల్లినూనె ఎంతో స‌హాయ‌కారి అని నిపుణులు చెప్తున్నారు. 

వేరుశెనగ నూనె ఒక‌ రకమైన వెజిటబుల్ నూనె. దీనిని వంటలలో సాదారణంగా ఉపయోగిస్తారు. వీటిలో శుద్ధి, శుద్ది చేయని, బెక్ చేసిన, కోల్డ్ ప్రెస్డ్‌ వంటి అనేక రకాలు ఉంటాయి. సాధారణంగా ప్రజలు మంచి రుచి కోసం వంటలలో వేరుశెనగ నూనెను ఉపయోగిస్తారు. ముఖ్యంగా అనేక రకాలను బేక్ చేయటానికి, ఇతర నూనెల కంటే ఈ నూనె చాలా మంచిదే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా.

ప‌ల్లి నూనెలో ఓలిక్ ఆమ్లం, స్టియరిక్ ఆమ్లం, పల్మిటిక్ ఆమ్లంతోపాటు లినోలెనిక్ ఆమ్లం వంటి కొవ్వు ఆమ్లాలు దాని విభిన్న రకాల నుండి వస్తాయి. కొవ్వు ఆమ్లాల అసమతుల్య స్థాయిలు మ‌న ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు. వివిధ రకాల వేరుశెనగ నూనె మ‌న ఆరోగ్యం పెంచడానికి చాలా సురక్షితంగా సంతులనం చేస్తుంది. వేరుశెనగలో ఉండే ఇతర విటమిన్లు, ఖనిజాలు, కర్బన సమ్మేళనాలు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. 

వేరుశ‌న‌గ నూనెలో ఉండే ఫైతోస్తేరాల్స్ 10-15 శాతం కొలెస్ట్రాల్ స్థాయిల‌ను తగ్గిస్తుందని, ఇది కడుపు, ప్రేగులో కొలెస్ట్రాల్ శోషణను చేస్తుందని ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది. 

చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, రక్తనాళాలకు సంబంధించిన గుండె వ్యాధి, స్ట్రోక్‌ వచ్చే అవకాశాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. 

వేరుశెనగ నూనెలో రెస్వెట్రాల్, పోలీఫెనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలలో ఉండి ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి పనిచేస్తాయి. ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ అభివృద్ధి అవకాశాలను తగ్గిస్తాయి.

ఈ నూనెలో ఉండే రెస్వెట్రాల్ రక్త నాళాలను ప్రభావితం చేసే వివిధ హార్మోన్ల సంకర్షణకు యాంజియోటెన్సిన్ వంటి హార్మోన్ ను కలిగి ఉంటుంది. ఇది హృదయనాళ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గించి రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. 

రెస్వెట్రాల్ యాంటీ యాక్సిడెంట్ అల్జీమ‌ర్స్ వ్యాధి రాకుండా కూడా కాపాడుతుంది. 

అకాల వృద్ధాప్యం, చ‌ర్మంపై ముడతలను కలిగించే ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుంచి రక్షిస్తుంది. వేరుశెనగ నూనెలో ఉండే ఈ విటమిన్‌ చర్మాన్ని యవన్నంగా, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. 

రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డంలో ప‌ల్లినూనె చాలా స‌హాయ‌ప‌డుతుంది. వైర‌ల్ వ్యాధులు రాకుండా మ‌న‌ల్ని కాపాడుతుంది.

బ‌రువుత‌గ్గించుకునేందుకు, ఇన్సులిన్ సున్నిత‌త్వాన్ని మెరుగుప‌రిచేందుకు, వెంట్రుక‌లు బాగా పెరిగేందుకు, వృద్ధాప్య‌ఛాయ‌లు క‌నిపించ‌కుండా ఉండేందుకు, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండేందుకు కూడా వేరుశ‌న‌గ నూనె మ‌న‌కు స‌హ‌క‌రిస్తుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo