చ‌లికాలం అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు తుల‌సి ఆకుల‌తో చెక్‌..!


Mon,November 12, 2018 12:19 PM

తుల‌సి మొక్క‌లు దాదాపుగా అంద‌రి ఇండ్ల‌లోనూ ఉంటాయి. మ‌హిళ‌లు నిత్యం ఉద‌యాన్నే తుల‌సి మొక్క‌లకు పూజ‌లు చేస్తుంటారు. తుల‌సి మొక్క ఇంట్లో ఉండ‌డం అంటే.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరికిన‌ట్లే. తుల‌సి మొక్క ఆకుల వ‌ల్ల మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. వాటితో మ‌నం ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తులసి మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. నోటిపూత, నోట్లో అల్సర్స్, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు తులసి ఎంతో ఉపకరిస్తుంది. తుల‌సి ఆకుల‌ను కొన్నింటిని నిత్యం మూడు పూట‌లా న‌ములుతూ ఉంటే ఈ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

2. చిన్నపిల్లల్లో తరచూ వ‌చ్చే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులకు తుల‌సి ఆకులు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. వీటితో త‌యారు చేసిన క‌షాయాన్ని తాగిస్తే చాలు, ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

3. తులసి ఆకులను డికాషన్‌గా తీసుకుంటే తలనొప్పి త‌గ్గుతుంది. తులసి ఆకులను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, దాంతో దంతాలు తోముకుంటే దంతాలకు చాలా మంచిది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్‌లా వాడుకుంటే దంతక్షయంతో పాటు నోటిదుర్వాసన కూడా పోతుంది.

4. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొన్ని తుల‌సి ఆకుల‌ను తీసుకుంటే డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. పిల్ల‌ల్లో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.

5. బ్రాంకైటిస్‌, ఆస్త‌మా ఉన్న‌వారు తులసి ఆకుల్ని నోట్లో వేసుకుని నమలటం వల్ల ఆయా స‌మ‌స్య‌ల‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. చ‌లికాలంలో జ‌లుబు, శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌కు కూడా తుల‌సి ఆకులు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి.

6. ప్రతిరోజు 5 లేదా 6 తుల‌సి ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులి పురుగులు నశిస్తాయి.

7. మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆరసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.

8. తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమ‌లు పోయి ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.

3049

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles