జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి త‌గ్గాలంటే..?


Thu,June 7, 2018 08:21 AM

ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి సర్వసాధారణంగా ఎవరికైనా వస్తాయి. దీంతో ఈ అనారోగ్యాలను తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతుంటారు. అయితే అలా ఆ మెడిసిన్‌ను ఇష్టం వచ్చినట్టు వాడితే ఎప్పటికైనా ముప్పు తప్పదు. ఈ క్రమంలోనే అలాంటి బాధకు గురి కావల్సిన అవసరం లేకుండానే మనం ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే పైన చెప్పిన అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చిటికెడు వామును తీసుకుని బాగా నలపాలి. దాన్ని దవడన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వెంటనే పోతాయి.

2. రోజుకు 3 పూటలా కొన్ని తులసి ఆకులను తీసుకుని బాగా నమిలి ఆ రసం మింగుతూ ఉంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. అలా కాకపోతే తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగినా చాలు. పైన చెప్పిన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

3. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనెలను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని అలాగే చప్పరించాలి. ఇలా రోజుకు 3 సార్లు తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.

4. చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుని చప్పరించాలి. లేదా అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగినా చాలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

5. తేనె, అల్లంరసం, నిమ్మరసంలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా కలిపి సేవించాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు తగ్గుతాయి.

6. తేనె, మిరియాల పొడిలను ఒక టీస్పూన్ మోతాదులో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. జలుబు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీన్ని రెండు పూటలా తీసుకోవాల్సి ఉంటుంది.

7. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి కలిపి తాగినా చాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పి మాయమవుతాయి.

8. వేడి నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం వేసి కలిపి తాగితే జలుబు, దగ్గు మాయమవుతాయి.

5616

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles