రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే..?


Sat,July 14, 2018 04:01 PM

మన శరీరానికి శక్తినందించే దుంపల్లో బీట్‌రూట్ కూడా ఒకటి. దీన్ని చాలా మంది కూరగా చేసుకుని తింటారు. కొందరు జ్యూస్ తాగుతారు. అయితే రోజూ కూరలా చేసుకుని తినలేరు కనుక, జ్యూస్ తీసుకుని ఒక గ్లాస్ మోతాదులో తాగితే మంచిది. దీంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ను తాగితే దాంతో శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు.

2. ఎప్పుడూ బద్దకంగా ఉండే వారు బీట్‌రూట్ జ్యూస్ తాగితే యాక్టివ్ అవుతారు. దీంతో ఉత్సాహంగా పనిచేయవచ్చు. ఈ జ్యూస్ మనలో చురుకుదనాన్ని పెంచుతుంది. ఎక్కువ సేపు యాక్టివ్‌గా ఉంటారు. అంత త్వరగా అలసిపోరు.

3. గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎంతో మంచిది. దీంతో వారికి కావల్సిన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. తద్వారా అది కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. శిశువు సక్రమంగా ఎదుగుతుంది. ఆరోగ్యంగా పుడుతుంది.

4. ఎదిగే పిల్లలకు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ను తాగించాలి. దీంతో వారికి సంపూర్ణ పోషణ అందుతుంది. బీట్ రూట్‌లో ఉండే విటమిన్ ఎ, సి, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతాయి. వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుల్లో రాణిస్తారు.

5. బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే గుండె సమస్యలు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. ముఖ్యంగా హై బీపీ తగ్గుతుంది.

6. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజూ బీట్‌రూట్ జ్యూస్ సేవిస్తే ఆ సమస్య పోతుంది. రక్తం పెరుగుతుంది.

7. లివర్ శుభ్రమవుతుంది. చర్మం, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. పెదవులు పగలవు. ఎముకలు దృఢంగా మారుతాయి.

8. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చురుగ్గా ఆలోచించగలుగుతారు.

5363

More News

VIRAL NEWS

Featured Articles