HomeLATEST NEWS8 effective health benefits of drinking coconut oil everyday

కొబ్బరినూనెను ఇలా తాగితే బరువు వేగంగా తగ్గవచ్చు తెలుసా..?

Published: Sat,February 17, 2018 02:33 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
నేటి తరుణంలో మనకు అనేక చోట్ల వినిపిస్తున్న మాట.. కొబ్బరినూనె. దీంతో అధిక బరువు తగ్గవచ్చని, మధుమేహం తగ్గుతుందని, థైరాయిడ్ సమస్య పోతుందని చెబుతున్నారు. అయితే ఇది నిజమే. కొబ్బరినూనెను రోజూ కొంత మోతాదులో తాగడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. కొబ్బరినూనెపై దాదాపుగా 1500కు పైగా చేసిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కొబ్బరినూనెను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. అయితే దీన్ని రోజూ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

* 40 నుంచి 60 కిలోల లోపు బరువు ఉన్న వారు నిత్యం 3 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను డైరెక్ట్‌గా అలాగే తాగవచ్చు. కానీ ఒకేసారి తాగకూడదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు ఒక్కో టేబుల్ స్పూన్ మోతాదులో ఈ నూనెను తాగాలి.
* 61 నుంచి 80 కిలోల మధ్య బరువు ఉన్న వారు నిత్యం 4.5 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకోవచ్చు. అయితే ఒక్కో పూట 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను భోజానికి ముందు తీసుకోవాలి.
* 81 కిలోలు ఆపైన బరువు ఉన్న వారు నిత్యం 6 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరినూనె తాగవచ్చు. ఒక్కో పూట 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను భోజనానికి ముందు తాగాలి.

కొబ్బరినూనె తాగే వారికి సూచనలు...


* ఇక కొబ్బరినూనె ఏది పడితే అది తాగకూడదు. కేవలం ఎక్స్‌ట్రా వర్జిన్ లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరికే కొబ్బరినూనెను మాత్రమే వాడాలి. ఇవే స్వచ్ఛమైన కొబ్బరినూనె కిందకు వస్తాయి.
* కొబ్బరినూనెను పైన తెలిపిన విధంగా డైరెక్ట్‌గా తాగలేకపోతే సలాడ్స్, చక్కెర లేని పండ్ల రసాలు, హెర్బల్ టీలు తదితర ఆహారాల్లో కలుపుకుని కూడా తాగవచ్చు.
* కొబ్బరినూనెను తాగడం మొదలు పెట్టిన ఆరంభంలో వాంతికి వచ్చినట్టు ఉండడం, విరేచనాలు కావడం జరుగుతుంది. ఇవి సహజమే. అయితే తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే కొబ్బరినూనెను వాడకూడదు. పైన చెప్పిన డోస్ కన్నా ఇంకా తక్కువ మొత్తంతో తాగి ఆయా అనారోగ్య సమస్యలు కనిపించకపోతే నెమ్మదిగా డోస్‌ను పెంచవచ్చు.

పైన చెప్పిన విధంగా కొబ్బరినూనెను తీసుకుంటే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరినూనెను రోజూ తాగడం వల్ల అందులో ఉండే మీడియం చెయిన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో థైరాయిడ్ సమస్య పోతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో కరగకుండా ఉన్న ఎంత మొండి కొవ్వు అయినా సరే ఇట్టే కరిగిపోతుంది.

2. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది.

3. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మంపై ఏర్పడే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.

4. గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. శిరోజాలు దృఢంగా, ప్రకాశవంతంగా మారుతాయి.

5. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

6. కొబ్బరినూనెలో సహజసిద్ధమైన యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.

7. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండవచ్చు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎంత పనిచేసినా త్వరగా అలసిపోరు. రోజు మొత్తం యాక్టివ్‌గా ఉంటారు.

8. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్దకం బాధించవు.
10209
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology