అరటి పండ్లను అధికంగా తింటే కలిగే సమస్యలివే..!


Thu,June 14, 2018 08:21 AM

అరటి పండ్లను చాలా మంది ఎంతో ఆసక్తిగా తింటుంటారు. ఇతర పండ్లతో పోలిస్తే వీటి ధర కూడా కొంత తక్కువగానే ఉంటుంది. అందుకని సాధారణంగా చాలా మంది అరటిపండ్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా అందరికీ తెలుసు. అయితే అరటి పండ్లను మోతాదుకు మించి మాత్రం తినరాదు. వీటిని అతిగా తింటే అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మలబద్దకం


అరటిపండ్లను అతిగా తినడం వల్ల మలబద్దకం ఏర్పడుతుంది. పిండి పదార్థాలు అరటిపండ్లలో అధికంగా ఉంటాయి. ఇవి అంత సులభంగా జీర్ణం కావు. సమయం పడుతుంది. దీంతో జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అరటి పండ్లలో పెక్టిన్ అనబడే పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లో ఉండే నీటిని శోషించుకుంటుంది. అందుకని అరటిపండ్లను ఎక్కువగా తింటే పేగుల్లో ఆహారం, మలం కదలికలు సరిగ్గా ఉండవు. దీంతో మలబద్దకం వస్తుంది.

2. పోషకాల అసమతుల్యత


మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, సక్రమంగా పనిచేయాలన్నా నిత్యం మనకు అనేక పోషకాలు అవసరం అవుతాయి. అయితే అరటి పండ్లను అధికంగా తింటే ఆ పోషకాలు మనకు సరిగ్గా అందవు. దీంతో పోషకాహార లోపం సమస్య వస్తుంది. అలాగే పలు వ్యాధులు కూడా వస్తాయి.

3. అధిక పీచు పదార్థం


అరటి పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందుకని ఆ పండ్లను అధికంగా తింటే జీర్ణాశయంలో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా కడుపునొప్పి, గ్యాస్ వస్తాయి. అలాగే శరీరం క్యాల్షియం, ఐరన్‌లను గ్రహించలేదు.

4. అధిక బరువు


అరటి పండ్లను అధికంగా తింటే బరువు పెరుగుతారు. కనుక బరువు తగ్గాలనుకునే వారు రోజుకు 2 మించి అరటి పండ్లను తినరాదు. వాటిల్లో అధికంగా ఉండే పిండి పదార్థం అధికంగా బరువు పెరిగేలా చేస్తుంది. శరీరంలోకి క్యాలరీలు ఎక్కువగా వచ్చి చేరుతాయి.

5. నిద్ర


అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది. ఈ క్రమంలో అరటి పండ్లను ఎక్కువగా తింటే నిద్ర బాగా వస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయలేదు. బద్దకంగా ఉంటారు.

6. కొవ్వు


నిత్యం మనకు అందాల్సిన అనేక పోషకాల్లో కొవ్వు కూడా ఒకటి. రోజూ కొవ్వు పదార్థాలను కూడా ఎంతో కొంత మోతాదులో తీసుకోవాలి. దీనివల్ల మెదడు సరిగ్గా పనిచేస్తుంది. అయితే అరటి పండ్లను అధికంగా తింటుంటే కొవ్వు పదార్థం తిన్నా అది మన శరీరంలోకి చేరదు. శరీరం దాన్ని శోషించుకోదు. ఫలితంగా మెదడు పనితీరు మందగిస్తుంది.

7. దంత సమస్యలు


అరటి పండ్లను అధికంగా తింటే కలిగే మరో సమస్య దంతాలు పాడవడం. దంత క్షయం వస్తుంది. దంతాలు త్వరగా అరిగిపోతాయి. వాటి మధ్యలో క్షయం ఆరంభమవుతుంది. ఇతర దంత సమస్యలు కూడా వస్తాయి.

5638

More News

VIRAL NEWS