ఏయే జ్యూస్‌లు తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయంటే..?


Mon,December 10, 2018 03:34 PM

మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో పండ్లు, కూరగాయల రసాలు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా, నిత్యం యాక్టివ్‌గా ఉండేందుకు కూడా ఆయా జ్యూస్‌లు మనకు బాగా ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే ఏయే జ్యూస్‌లను తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. క్యారెట్ జ్యూస్


క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపుతుంది. అలాగే చర్మాన్ని సంరక్షిస్తుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

2. దానిమ్మ జ్యూస్


చర్మాన్ని సంరక్షించడంలో, క్యాన్సర్ కణాలను బయటకు పంపడంలో దానిమ్మ పండు జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

3. ద్రాక్ష పండ్ల రసం


ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిత్యం ఈ జ్యూస్‌ను సేవిస్తే చర్మం సురక్షితంగా ఉంటుంది. రక్త సరఫరా పెరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది.

4. టమాటా జ్యూస్


టమాటాల్లో లైకోపీన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ప్రతి రోజూ టమాటా జ్యూస్ తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. జిడ్డు చర్మం పోతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్త సరఫరా పెరుగుతుంది.

5. కీరదోస జ్యూస్


కీరదోస జ్యూస్‌ను రోజూ తాగితే అధిక బరువు తగ్గుతారు. కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కీళ్ల వ్యాధులు ఉన్నవారు రోజూ ఈ జ్యూస్ తాగడం మంచిది.

6. ఆరెంజ్ జ్యూస్


దీంట్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి సంరక్షణ లభిస్తుంది. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

7. బీట్‌రూట్ జ్యూస్


రోజూ బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

4741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles