వెరికోజ్ వీన్స్ ఉన్న‌వారు ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాలి..!

Sat,February 16, 2019 03:30 PM

వెరికోజ్ వీన్స్ స‌మ‌స్య ఉన్న‌వారిలో కాళ్లు, పాదాల్లో ఉండే ర‌క్త‌నాళాలు ఉబ్బిపోయి క‌నిపిస్తాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే అవి నీలం లేదా ఊదా రంగులో ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో నాళాలు వంక‌ర్లు తిరిగిపోతాయి కూడా. దీని వ‌ల్ల రక్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌దు. దీంతో కాళ్ల‌లో నొప్పులు వ‌స్తాయి. భారంగా అనిపిస్తాయి. అయితే వెరికోజ్ వీన్స్ వ‌చ్చేందుకు మాత్రం అనేక కార‌ణాలు ఉంటాయి.


కాళ్లు లేదా జీర్ణాశ‌యంపై అధికంగా ఒత్తిడి ప‌డినా, మ‌హిళ‌లు గ‌ర్భంతో ఉన్న సమ‌యంలో, స్థూల‌కాయం, తీవ్ర‌మైన మ‌ల‌బ‌ద్ద‌కం, ట్యూమ‌ర్లు ఏర్ప‌డ‌డం, నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌డం.. వంటి అనేక కార‌ణాలు వెరికోజ్ వీన్స్‌కు దారి తీస్తాయి. అయితే ఈ స‌మ‌స్య వ‌చ్చిన వారు డాక్ట‌ర్ చే త‌గిన చికిత్స తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. కింద తెలిపిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం కూడా అంతే అవ‌స‌రం. మ‌రి వెరికోజ్ వీన్స్ వ‌చ్చిన వారు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వెరికోజ్ వీన్స్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయాలి. గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌కుండా చూసుకోవాలి. అలా కూర్చోవాల్సి వ‌స్తే మ‌ధ్య మ‌ధ్య‌లో లేచి కొంత సేపు న‌డుస్తుండాలి.

2. మ‌సాజ్ ఆయిల్స్ తో నిత్యం కాళ్ల‌ను, పాదాల‌ను సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. అధికంగా ఒత్తిడి ప‌డ‌కుండా సుతారంగా మ‌ర్ద‌నా చేయాలి.

3. ర‌క్త స‌ర‌ఫరా పెరిగేందుకు కాళ్ల‌ను పైకి ఉంచాలి. ముఖ్యంగా నిద్రించే స‌మ‌యంలో ఇలా చేయాలి.

4. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ్గా ఉండేందుకు వ‌దులైన దుస్తుల‌ను ధ‌రించాలి. బిగుతుగా ఉన్న వ‌స్త్రాల‌ను ధ‌రించ‌రాదు.

5. వెరికోజ్ వీన్స్ స‌మ‌స్య ఉన్న‌వారు ఆయుర్వేద మందుల‌ను ఉప‌యోగిస్తే ఫ‌లితం ఉంటుంది.

6. ఫ్లేవ‌నాయిడ్స్ ఎక్కువ‌గా ఉండే ఉల్లిపాయ‌లు, క్యాప్సికం, పాల‌కూర‌, ద్రాక్ష‌లు, చెర్రీలు, యాపిల్స్‌, బ్లూబెర్రీలు, వెల్లుల్లి త‌దిత‌ర ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి.

7. పొటాషియం ఎక్కువ‌గా ఉండే బాదం ప‌ప్పు, పిస్తాలు, ప‌ప్పు దినుసులు, ఆలుగ‌డ్డ‌లు, ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, చేప‌లు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే న‌ట్స్‌, సీడ్స్‌, ఓట్స్‌, అవిసెలు, తృణ ధాన్యాలు త‌దిత‌ర ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే వెరికోజ్ వీన్స్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

6465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles