చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఎఫెక్టివ్ చిట్కాలు..!


Sun,April 15, 2018 12:33 PM

చ‌ర్మంపై దుర‌ద‌లు రావ‌డం, దద్దుర్లు ఏర్ప‌డ‌డం.. కొన్ని సంద‌ర్భాల్లో పుండ్లు కావ‌డం, చ‌ర్మం పైపొర పొట్టు లేవ‌డం.. త‌దిత‌రాల‌న్నీ చ‌ర్మ స‌మ‌స్య‌ల కింద‌కి వ‌స్తాయి. ఇవి కొంద‌రికి అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే వ‌స్తాయి. కానీ కొంద‌రికి ఈ స‌మ‌స్య‌లు దీర్ఘ‌కాలికంగా ఉంటాయి. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య అయినా కింద సూచించిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే సుల‌భంగా త‌గ్గిపోతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కొబ్బరి నూనె


సూక్ష్మ జీవులను చంపే సహజ సిద్ధ‌మైన గుణాలను కలిగే ఉండే కొబ్బరి నూనె చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీకు దురదలు వ‌స్తుంటే ప్రభావిత ప్రాంతంలో కొద్దిగా కొబ్బరి నూనెను రాసి మర్ద‌నా చేస్తే ఆ దుర‌ద‌ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

2. ఆలివ్ ఆయిల్


చ‌ర్మాన్ని సంర‌క్షించే ఎన్నో గుణాలు ఆలివ్ ఆయిల్‌లో ఉంటాయి. ఆలివ్ ఆయిల్‌ను స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై రాసి ఆ భాగానికి వేడి గుట్ట చుట్టాలి. అలా కొంత సేపు ఉంచాలి. అవ‌స‌రం అనుకుంటే ఆలివ్ ఆయిల్‌, కొబ్బ‌రినూనెల‌ను క‌లిపి కూడా ఇలా చేయ‌వ‌చ్చు. దీంతో చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

3. వేప


వేప చెట్టు ఆకుల‌ను కొన్నింటిని తీసుకుని బాగా నూరి మిశ్ర‌మంగా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాయాలి. కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల వేప ఆకుల్లో స‌హ‌జ‌సిద్ధంగా ఉండే యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. చ‌ర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మారుస్తాయి.

4. తేనె, దాల్చిన చెక్క‌


ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిల‌ను తీసుకుని వాటిని క‌లిపి పేస్ట్‌లా చేసి చ‌ర్మంపై రాయాలి. వీటిల్లో ఉండే యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి. చ‌ర్మానికి మృదుత్వాన్ని తెస్తాయి.

5. నిమ్మ‌కాయ


నిమ్మ‌కాయ‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఇది చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. చ‌ర్మంపై నిమ్మ‌కాయ ముక్క‌ను రుద్ది కొంత‌సేపు ఆగాక క‌డిగేస్తే చ‌ర్మం కాంతివంతమ‌వుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి.

6. కలబంద


చ‌ర్మంపై ద‌ద్దుర్లు, దుర‌ద వ‌చ్చే వారు, మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉన్న‌వారు వాటిపై రోజూ క‌ల‌బంద గుజ్జును రాస్తూ ఉంటే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

7. బొప్పాయి


చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బొప్పాయి పండు గుజ్జు కూడా బాగానే ప‌నిచేస్తుంది. దీన్ని చ‌ర్మంపై స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రోజూ రాస్తూ ఉంటే బాధ నుంచి విముక్తి చెంద‌వ‌చ్చు.

4878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles