ఈ లాభాలు తెలిస్తే బొప్పాయి విత్త‌నాలు ప‌డేయ‌రు తెలుసా..?


Wed,May 2, 2018 06:25 PM

బొప్పాయి పండ్లతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి కావల్సిన పోషకాలు బొప్పాయి పండ్లలో ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు, దంత సమస్యలకు, రక్త సరఫరాకు బొప్పాయి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మీకు తెలుసా..? కేవలం బొప్పాయి పండు మాత్రమే కాదు, అందులో ఉండే విత్తనాలు కూడా మనకు ప్రయోజనకరమే. నిత్యం ఉదయాన్నే పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే దాంతో మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజూ ఉదయాన్నే పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే దాంతో శరీరంలో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా తయారవుతుంది. పలు అవయవాల్లో ఉండే వ్యర్థాలు తొలగింపబడతాయి.

2. జీర్ణాశయంలో ఉండే క్రిములు నాశనమవుతాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ప్రధానంగా కడుపులో ఉండే పలు రకాల పురుగులు నశిస్తాయి.

3. బొప్పాయి విత్తనాల్లో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గిస్తాయి. శరీర మెటబాలిజం రేటును పెంచడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.

4. కండరాలు దృఢంగా మారుతాయి. నిత్యం మన తినే ప్రోటీన్లు సక్రమంగా వినియోగమవుతాయి. అందువల్ల కండరాల సమస్యలు పోవడమే కాదు, కండరాలు చక్కగా నిర్మాణమవుతాయి.

5. నిత్యం పని ఒత్తిడి కారణంగా కలిగే అలసట తగ్గుతుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు. ఉత్సాహంగా ఉంటారు.

6. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు వంటివి రావు.

7. బొప్పాయి విత్తనాలు పురుషుల్లో వీర్య నాణ్యతను పెంచుతాయి. శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి.

బొప్పాయి విత్తనాలను సాధారణంగా ఎవరైనా పడేస్తారు. కానీ వాటిని నిర్భయంగా తినవచ్చు. ఎవరైనా వాటిని రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. అయితే విత్తనాలను డైరెక్ట్‌గా తినలేమని అనుకునే వారు, వాటిని పొడి చేసుకుని దాన్ని మజ్జిగ, లేదా ఏదైనా సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు. ఇలా తిన్నా పైన చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయి.

7748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles