న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ లైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని రష్యా తయారీ సంస్థ, భారత్‌లోని భాగస్వామ్య కంపెనీలతో సహా నియంత్రణ సంస్థ అధికారులను ఆదేశించింది. వచ్చే రెండు వారాల్లో ఈ టీకా అనుమతుల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. అనుమతులు మంజూరైతే.. దేశంలో అందుబాటులోకి రానున్న తొలి సింగిల్ డోస్ టీకా స్పుత్నిక్-వీ లైట్ కానున్నది.