ఆముదంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?

Wed,November 6, 2019 01:31 PM

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల నూనెల్లో ఆముదం కూడా ఒకటి. ఆముదం గింజల నుంచి ఈ నూనెను తీస్తారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు మనకు ఆముదం బాగా పనిచేస్తుంది. దాంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. మలబద్దకంతో బాధపడేవారు ఆముదాన్ని సేవిస్తుంటే ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఆముదంలో ఉండే రికినోలీయిక్ యాసిడ్ పేగుల గోడలను మృదువుగా మారుస్తుంది. దీంతో పేగుల్లో మలం సులభంగా కదిలి సుఖవంతంగా విరేచనం అవుతుంది. తద్వారా మలబద్దకం సమస్య తగ్గుతుంది.

2. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఆముదం బాగా పనిచేస్తుంది. కొద్దిగా ఆముదాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట రాస్తుంటే ఎలాంటి నొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. ఆముదంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి.

3. మన శరీరంలో పలు హార్మోన్లు సక్రమంగా పనిచేయాలంటే అందుకు కొవ్వు పదార్థాలు సరిగ్గా శోషించుకోబడాలి. అయితే ఆముదాన్ని సేవిస్తే ఆ కొవ్వు పదార్థాలను శరీరం బాగా శోషించుకుంటుంది. దీంతో హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి.

4. ఆముదాన్ని సేవించడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మన శరీరంలో చేరే టాక్సిన్లు, బాక్టీరియాలకు వ్యతిరేకండా పోరాడే లింఫోసైట్ల ఉత్పత్తిని ఆముదం పెంచుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

5. కాలిన గాయాలు, పుండ్లు, ఇన్‌ఫెక్షన్లు, ఇతర గాయాలపై ఆముదం నూనెను రాస్తుంటే ఆయా గాయాలు త్వరగా మానుతాయి. ఆముదంలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తాయి.

6. ఆముదాన్ని నిత్యం తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. చర్మానికి రాసుకుంటే చర్మం పగలకుండా ఉంటుంది. మృదువుగా మారుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది.

4080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles