ఆవ నూనెతో కలిగే అద్భుతమైన లాభాలు తెలుసా..?


Sun,May 20, 2018 02:59 PM

మన భారతీయులు వాడే వంట ఇంటి దినుసుల్లో ఆవాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. పోపు గింజల్లో ఇవి ఒక భాగం. అనేక రకాల కూరలను వండేటప్పుడు వేసే పోపు గింజల్లో ఆవాలు కచ్చితంగా ఉంటాయి. వీటితో వంటలకు చక్కని వాసన, రుచి వస్తాయి. ఆవాలలో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలనిచ్చే ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాగే ఆవాలతో తయారు చేసే ఆవనూనె వల్ల కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మన శరీరంలో పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో ఆవనూనె సమర్థవంతంగా పనిచేస్తుంది. కొవ్వు కణాలను ఆవ నూనె నాశనం చేస్తుంది. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీంతోపాటు శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. కనుక ఆవనూనెను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి.

2. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఆవనూనె చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఆవనూనెను ఛాతిపై మర్దనా చేసుకుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే అలా చేసే ముందు ఆవనూనెను కొద్దిగా వేడి చేయాలి.

3. థైరాయిడ్, మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు ఆవనూనె తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే జీర్ణాశయం, పేగుల్లో ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఆవనూనె సేవిస్తే బాక్టీరియా, వైరస్‌లు నశించి ఆరోగ్యం కలుగుతుంది.

4. ఆవనూనె కొంత తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, శనగపిండి కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని ముఖానికి రాయాలి. కొంత సేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతిని సంతరించుకుంటుంది. ముఖంపై ఉండే మచ్చలు పోతాయి.

5. చర్మంపై ఉన్న మచ్చలను తొలగించేందుకు ఆవనూనె బాగా పనికొస్తుంది. నిమ్మరసం, ఆవనూనె కలిపి మచ్చలు, గాయాలు వంటి వాటిపై రాస్తూ ఉంటే ఫలితం ఉంటుంది.

6. బీట్‌రూట్ జ్యూస్, ఆవ నూనె సమ పాళ్లలో కలిపి పెదవులకు రాస్తుంటే పెదవుల పగుళ్లు తగ్గుతాయి. పెదవులు ఎర్రగా కూడా మారుతాయి.

3297

More News

VIRAL NEWS