కొవ్వు కర‌గాలంటే.. ఇలా చేయాలి..!


Sun,December 31, 2017 10:21 AM

స్థూలకాయం, ఊబకాయం, ఒబెసిటీ... పేరైదేనా, ఇది రావడానికి మూల కారణం మాత్రం శరీరంలో అధికంగా పేరుకుపోయే కొవ్వు నిల్వలే. దీని వల్ల లావుగా కనిపించడంతోపాటు నలుగురిలోనూ ఆకర్షణీయతను కోల్పోవాల్సి వస్తుంది. దీంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. అయితే కింద పేర్కొన్న పలు చిట్కాలను పాటిస్తే కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. మరి వాటి గురించి తెలుసుకుందామా..!

1. ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండాలి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొవ్వు కరుగుతుంది.

2. రెండు టేబుల్ స్పూన్ల క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.

3. గోరువెచ్చని ఒక గ్లాస్ నీటిలో నువ్వుల నూనె ఒక టీస్పూన్, అల్లం రసం ఒక టీస్పూన్‌ల మోతాదులో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇది పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తుంది.

4. గోరువెచ్చగా ఉండే ఒక గ్లాస్ నీటిలో అవిసె గింజెల పొడి ఒక టీస్పూన్, తేనె ఒక టీస్పూన్ కలిపి ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తాగాలి. ఇది కూడా పొట్ట దగ్గర కొవ్వును బాగా తగ్గిస్తుంది.

5. గ్రీన్ టీ పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మ రసం 1/4 టీస్పూన్, తేనె 2 టీస్పూన్లు తీసుకుని వీటిని ఒక గ్లాస్ నీటిలో కలపాలి. 3 నిమిషాల పాటు బాగా క‌లిపాక ఈ మిశ్ర‌మాన్ని రోజుకి రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

6. రెండు టేబుల్ స్పూన్ల తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో బాగా కలిపి దీన్ని ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును క‌రిగిస్తుంది.

10085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles