ఏసీల్లో గడిపేవారికి కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..!


Sun,June 3, 2018 11:12 AM

ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు అనేక మంది అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. వాట్లిలో ఏసీ కూడా ఒకటి. చల్ల చల్లగా ఏసీ కింద కూర్చుంటే వేసవి తాపం అస్సలు తెలియదు. బయట ఎంత ఉష్ణోగ్రత ఉన్నా ఏసీ కింద ఉంటే చల్లగానే ఉంటుంది. బయటి వేడి లోపలికి రాదు. అయితే ఏసీ వల్ల చల్లని గాలి అందే మాట ఎలా ఉన్నప్పటికీ దాని వల్ల మనకు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కళ్లు పొడి బారిపోయే సమస్య ఉన్న వారు ఏసీల కింద కూర్చోరాదు. దాని వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. ఏసీల కింద ఉండడం వల్ల సహజంగానే కళ్లు పొడిబారతాయి. కళ్లలో స్రవించే ద్రవాల పరిమాణం తగ్గుతుంది. అందువల్ల కళ్లు పొడిబారిపోయి దురదలు పెడతాయి. కనుక అంతకు ముందే ఆ సమస్య ఉన్నవారు ఏసీల కింద కూర్చోకపోవడమే ఉత్తమం.

2. ఏసీల కింద గంటల తరబడి గడిపే వారికి చర్మం పొడిబారిపోయి దురద పెడుతుంది. ఏసీ కింద ఉండి ఎండలోకి వెళితే చర్మం మరింద పొడిబారుతుంది. తద్వారా సమస్య మరింత పెరుగుతుంది. ఇక పొడిచర్మం ఉన్న వారికైతే ఈ సమస్య మరింత ఎక్కువ ఉంటుంది.

3. ఏసీ వల్ల గదిలో ఉండే తేమ శాతం తగ్గుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. నీళ్లు బాగా తాగాలనిపిస్తుంది.

4. గంటల తరబడి ఏసీలో ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ముక్కు, గొంతు, కళ్లు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయి. గొంతు పొడిబారిపోతుంది. ముక్కు రంధ్రాలు పూడుకుపోతాయి. ముక్కు లోపలి భాగంలో ఉండే మ్యూకస్ పొర వాపునకు లోనవుతుంది. ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది.

5. ఆస్తమా, అలర్జీలు ఉన్నవారు ఏసీల్లో అస్సలు ఉండరాదు. లేదంటే సమస్య మరింత ఎక్కువవుతుంది.

6. ఏసీల్లో ఉండే వారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అది మైగ్రేన్‌కు కూడా దారి తీయవచ్చు. ఏసీల్లో ఉండడం వల్ల కలిగే డీహైడ్రేషన్ సమస్యే తలనొప్పికి కూడా కారణమవుతుంది. ఎండలో ఉండి సడెన్‌గా ఏసీలోకి వచ్చినా ఏసీ నుంచి ఒక్కసారిగా ఎండలోకి వెళ్లినా ఇలా జరుగుతుంది.

7849

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles