చ‌ర్మంపై ముడ‌త‌లు పోవాలంటే..?


Tue,February 12, 2019 03:02 PM

వ‌య‌స్సు మీద ప‌డుతుంటే ఎవ‌రికైనా చ‌ర్మంపై ముడ‌త‌లు ప‌డ‌డం స‌హ‌జ‌మే. అయితే మ‌న‌లో కొంద‌రికి మాత్రం యుక్త వ‌య‌స్సులోనే చ‌ర్మం ముడ‌త‌లు ప‌డుతుంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ.. కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో ఎవ‌రైనా స‌రే.. చ‌ర్మంపై ప‌డే ముడ‌త‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మరి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుని తడుచుకున్న తర్వాత నాలుగు చుక్కల నిమ్మరసం ముఖానికి రాసి అరగంట ఆగి ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. 15 నుండి 20 రోజులు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది.

2. ఆలివ్‌ ఆయిల్‌ ని ముఖం మీద నెమ్మదిగా మర్ద‌నా చేయాలి. దీని వ‌ల్ల చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌డం త‌గ్గుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

3. చల్లటి నీళ్ళతో ముఖం క‌డుక్కున్నప్పుడు వెంటనే టవల్‌తో తడుచుకోకుండా అలాగే ఆరనిస్తే చర్మం కొంత మేర తేమను పీల్చుకుంటుంది. దీంతో చర్మానికి తాజాదనం ల‌భిస్తుంది.

4. క్యారట్‌ రసం నిత్యం తాగితే చ‌ర్మం మీద ముడ‌త‌లు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.

5. బాగా పండిన బొప్పాయి గుజ్జును మెడ, ముఖం మీద రుద్దుకుంటే చర్మానికి మంచి రంగు వ‌స్తుంది. చ‌ర్మం మీద ఉండే ముడ‌త‌లు త‌గ్గుతాయి.

6. కళ్ళమీద, నుదుటిమీద దోసకాయ ముక్కలను రోజూ పెట్టుకోవాలి. ఇలా పదిహేను రోజులు చేస్తే ముడతల సమస్య తగ్గుతుంది.

4894

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles