జలుబును తగ్గించే చిట్కాలు..!


Thu,July 12, 2018 08:29 AM

సాధారణంగా ఎవరికైనా సీజన్ మారినప్పుడల్లా జలుబు వస్తుంటుంది. దీంతోపాటు కొందరికి ముక్కు దిబ్బడ, దగ్గు కూడా ఉంటాయి. అయితే వీటిని తగ్గించుకునేందుకు ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. అందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మరి జలుబును తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వేడిపాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే త్వరగా జలుబు తగ్గుతుంది. ముఖ్యంగా రాత్రి నిద్రించబోయే ముందు పాలు తాగితే రాత్రి సమయంలో జలుబు అంతగా బాధించదు. హాయిగా నిద్రపోవచ్చు. జలుబు వల్ల ఇబ్బంది కలగదు.

2. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చినచెక్క వేసి బాగా మరిగించి అనంతరం ఆ నీటిని వడకట్టి, దానికి కొద్దిగా తేనె కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.

3. జలుబును తగ్గించడంతో తులసి బాగా పనిచేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. దీంతో జలుబు ఇట్టే తగ్గిపోతుంది.

4. తులసి ఆకులతో టీ చేసుకుని తాగినా జలుబును తగ్గించుకోవచ్చు.

5. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, దాల్చినచెక్క పొడి, తేనెలను వేసి కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.

6. గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగినా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

3443

More News

VIRAL NEWS