బరువు త్వరగా తగ్గాలంటే.. ఈ సూచనలు పాటించాలి..!


Mon,November 26, 2018 04:53 PM

చాలా మంది నిత్యం వ్యాయామం చేస్తున్నాం కదా.. అని చెప్పి రోజులో అధికంగా క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకుంటుంటారు. అలాగే వ్యాయామం వల్ల చాలా త్వరగా బరువు తగ్గవచ్చని భావిస్తారు. ఆ మాట వాస్తవమే అయినప్పటికీ ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తేనే వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ క్రమంలోనే నిత్యం వ్యాయామం చేసేవారు అధిక బరువు త్వరగా తగ్గాలంటే అందుకు కింద సూచించిన టిప్స్‌ను ఫాలో అవ్వాలి. మరి ఆ టిప్స్ ఏమిటంటే...

1. ఆకలి బాగా అనిపించినప్పుడు కొందరు భ్రమపడి ఏదో ఒకటి తింటారు. కానీ అలా చేయరాదు. భోజనం చేశాక కూడా ఆకలిగా ఉంటే నీటిని తాగాలి. అంతే తప్ప మళ్లీ ఆహారం తీసుకోరాదు. దాని వల్ల అధికంగా క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు తప్ప తగ్గరు.

2. నిత్యం వంట చేసుకుని తినే ఆహారాల్లో ఎలాంటి పోషకాలు ఉంటున్నాయో జాగ్రత్త పడాలి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారాలను నిత్యం తింటుంటే బరువు తగ్గడం పెద్ద సమస్య ఏమీ కాదు.

3. ఎంత తిన్నా ఆకలి తీరడం లేదని భావించే వారు కొద్దిగా నిమ్మరసం తాగాలి. వీలుంటే ఒక గ్లాస్ నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి, అందులో పుదీనా రసం కలుపుకుని తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది.

4. క్యారెట్, కీర, టమాటా, బీట్‌రూట్ తదితర కూరగాయలను వీలైనంత వరకు పచ్చివే తింటుండాలి. ఇవి బరువు తగ్గించేందుకు సహకరిస్తాయి. దీంతోపాటు శరీరానికి పోషకాలు కూడా అందుతాయి.

5. వెన్నలేని పెరుగు, మజ్జిగ, పాలతోపాటు, నట్స్ తదితర ఆహారాలను తింటుంటే బరువు త్వరగా తగ్గుతారు.

6. కొందరు భోజనానికి, భోజనానికి మధ్యలో ఏదో ఒకటి తింటారు. అలా చేయరాదు. వాటికి బదులుగా డ్రై ఫ్రూట్స్, నట్స్, క్యారెట్, టమాటా జ్యూస్ వంటివి తీసుకుంటే శరీరంలో అధికంగా క్యాలరీలు చేరకుండా ఉంటాయి. ఫలితంగా అధిక బరువు కూడా చాలా త్వరగా తగ్గుతారు.

5662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles