కారంగా ఉన్నా పచ్చిమిరపకాయలను రోజూ తినాల్సిందే. ఎందుకో తెలుసా..?


Wed,May 16, 2018 06:01 PM

పచ్చి మిరపకాయలను నిత్యం మనం అనేక కూరల్లో వేస్తుంటాం. ఎండు కారంకు బదులుగా వీటిని కారం కోసం చాలా మంది కూరల్లో వేస్తారు. పచ్చి మిరప వల్ల కూరలకు చక్కని రుచి వస్తుంది. ఈ క్రమంలోనే కొందరు పచ్చి మిరప కాయలను అలాగే డైరెక్ట్‌గా తింటారు. కొందరు మజ్జిగలో వీటిని ఆరగిస్తారు. అయితే నిజానికి పచ్చి మిరపకాయలు కారంగా ఉన్నప్పటికీ వాటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పచ్చి మిరపలో విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి.

2. పచ్చి మిరపకాయలను విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది.

3. పచ్చిమిరప విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. పేగుల నుంచి కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరకుండా చూస్తుంది. దీంతోపాటు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

4. పచ్చి మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ శరీర మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుంది.

5. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చిమిరపను బాగా తీసుకుంటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ ఉంటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి. గాలి బాగా పీల్చుకోవచ్చు.

6. పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి చర్మ సమస్యలను పోగొడతాయి.

8660

More News

VIRAL NEWS