ఉడ‌క‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను రోజూ తింటే క‌లిగే లాభాలివే..!

Mon,January 7, 2019 07:15 PM

శ‌న‌గ‌ల‌లో మ‌న శ‌రీరానికి పనికొచ్చే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫోలేట్‌, మాలిబ్డినం, మాంగ‌నీస్‌, ప్రోటీన్, ఫైబ‌ర్‌లు శ‌న‌గ‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి. చాలా మంది శ‌న‌గ‌ల‌తో కూర చేసుకుని తింటారు. కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని వీటిని లాగించేస్తారు. అయితే శ‌న‌గ‌ల‌ను కూర‌గా క‌న్నా.. నిత్యం ఉడ‌క‌బెట్టుకుని తింటేనే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. ఒక క‌ప్పు శ‌న‌గ‌ల‌ను ఉడ‌కబెట్టి నిత్యం తింటే అధిక బ‌రువు త‌గ్గుతారు. స‌న్న‌గా ఉన్న‌వారు తింటే బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం 53 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటుంది. అంటే.. శ‌రీరంలో కొవ్వు పేరుకుపోద‌న్న‌మాట‌.

2. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు శ‌న‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్‌, ఫైబ‌ర్ అందుతాయి. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

3. శ‌న‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టుకుని రోజూ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మస్య‌లైన గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి.

4. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

5. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం ఉడ‌క‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను తినాలి. దీని వ‌ల్ల ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. అలాగే ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి.

6. స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల‌గాలంటే శ‌న‌గ‌ల‌ను తినాలి. శ‌న‌గ‌ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

10546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles