ధ‌నియాల‌తో అనారోగ్యాలు దూరం..!


Thu,August 9, 2018 06:12 PM

ధనియాలు అంటే తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. వంటిట్లో పోపుల పెట్టెలో ఉండే ఔషధం ధ‌నియాలు. కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్ గా (గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది.అలాగే రిఫ్రిజిరెంట్ గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్ గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్ గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది. ఇన్ని సుగుణాలున్న ధనియాలను చూస్తుంటే ప్రకృతి ప్రసాధించిన ఒక వరంగా మనం భావించాలి. కొత్తిమీర మొక్క‌నుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండబెట్టి, తర్వాత గింజల రూపంలో లేదా, పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు. ధనియాల్లో అనేక పోషకాలున్నాయి. వీటి వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ధనియాల కషాయం తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరేచనాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో ఏలికపాముల్ని బయటకు పంపుతుంది.

2. ప్రకృతిపరంగా లభించిన ధనియాలలో అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల, సహజ రూపంలో మనం తీసుకోవడం వల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలను తగ్గిచవచ్చని అనేక పరిశోధన‌లు, అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం రాకుండా నిరోధించడానికి, ఉన్న వ్యాధిని నయం చేయడానికి ధ‌నియాలు ప‌నికొస్తాయి. నిత్యం ధ‌నియాల క‌షాయం తాగుతుంటే మ‌ధుమేహం అదుపులోకి వ‌స్తుంది.

3. టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే గుణాలు ధ‌నియాల్లో ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఆహారం వల్ల కలిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ధ‌నియాలు చ‌క్క‌ని ప‌రిష్కారాన్ని చూపుతాయి. ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే ధ‌నియాల క‌షాయం తాగాలి.

4. ప‌సుపులో ధ‌నియాల పొడి లేదా ర‌సాన్ని క‌లిపి మొటిమ‌ల‌పై రాసుకుంటే మొటిమ‌లు త‌గ్గుతాయి.

5. ధ‌నియాల క‌షాయాన్ని తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

6. అంటువ్యాధులకు కారణం అయ్యే సూక్మక్రిములతో పోరాడే గుణాలు ధ‌నియాల్లో ఉంటాయి. ధనియాల‌ను తీసుకోవడం వల్ల వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ మన శరీరానికి అందుతాయి. దాంతో మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

1765

More News

VIRAL NEWS