మ‌ల‌బ‌ద్ద‌కం పోవాలంటే.. వీటిని రోజూ తినాలి..!


Sat,August 26, 2017 12:48 PM

స్థూల‌కాయం, మ‌ధుమేహం, థైరాయిడ్‌, ఎక్కువ సేపు కూర్చోవ‌డం, దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వంటి అనేక అంశాల కార‌ణంగా చాలా మందికి నేటి త‌రుణంలో మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తున్న‌ది. దీని వ‌ల్ల‌ గంట‌ల త‌ర‌బ‌డి బాత్ రూంలో కుస్తీలు ప‌డాల్సి వ‌స్తున్న‌ది. అయిన‌ప్ప‌టికీ విరేచ‌నం సుఖంగా అవుతుందా..? అంటే.. కావ‌డం లేదు. దీంతో రోజంతా అసౌక‌ర్యంగా ఫీల్ అవుతుంటారు. అయితే కింద ఇచ్చిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. దాంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి ఇట్టే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. యాపిల్


రోజుకో యాపిల్ తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు అనే మాట మ‌న‌కు తెలిసిందే. అయితే రోజుకో యాపిల్‌ను తింటే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎందుకంటే యాపిల్‌లో 4.5 గ్రాముల ఫైబ‌ర్ ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరిస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది. దీంతో సుల‌భంగా విరేచ‌నం అవుతుంది.

2. నారింజ


నారింజ పండ్ల‌లో విట‌మిన్ సి మాత్ర‌మే కాదు ఫ్లేవ‌నాల్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది నాచుర‌ల్ లాక్సేటివ్‌గా ప‌నిచేస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య పోతుంది. ఒక నారింజ పండులో 4 గ్రాముల వ‌ర‌కు ఫైబ‌ర్ ఉంటుంది. క‌నుక ఈ పండును రోజూ తింటే చాలు మ‌ల‌బ‌ద్ద‌కం అన్న మాటే ఉండ‌దు.
constipation-foods

3. పాప్ కార్న్


ఒక క‌ప్పు పాప్ కార్న్‌లో ఒక గ్రామ్ ఫైబ‌ర్ ఉంటుంది. క‌నుక రోజుకు 4 క‌ప్పుల వ‌ర‌కు పాప్ కార్న్ తిన్నా చాలు. దాంతో 4 గ్రాముల వ‌ర‌కు ఫైబ‌ర్ అందుతుంది. త‌ద్వారా జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. అయితే పాప్ కార్న్‌ను అలాగే తినాలి. అందులో ఫ్లేవర్ కోసం ఏ ప‌దార్థాన్ని క‌ల‌ప‌కూడ‌దు. క‌లిపితే క్యాల‌రీలు అధికంగా చేరుతాయి.

4. ఓట్స్


రోజుకు రెండు క‌ప్పుల ఓట్స్ తిన‌డం అల‌వాటు చేసుకున్నా చాలు. దాంతో 4 గ్రాముల వ‌ర‌కు ఫైబ‌ర్ అందుతుంది. అది మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

5. అవిసె గింజ‌లు


రోజుకు రెండు స్పూన్ల అవిసె గింజ‌ల‌ను తిన్నా చాలు. ఫైబ‌ర్ పుష్క‌లంగా అందుతుంది. మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

6. అలోవెరా


రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున 30 ఎంఎల్ మోతాదులో క‌ల‌బంద గుజ్జును తింటే దాంతో మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. ఇందులో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మై, విరేచ‌నం సాఫీగా అయ్యేలా చూస్తుంది.

16245

More News

VIRAL NEWS