హ్యాంగోవర్‌ను పోగొట్టే ఎఫెక్టివ్ చిట్కాలు..!


Mon,December 18, 2017 12:51 PM

మద్యం విపరీతంగా సేవించే వారికి హ్యాంగోవర్ కచ్చితంగా వస్తుంది. ఉదయం లేవగానే తల నొప్పి, వికారం, కడుపు నొప్పి, మంట, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో హ్యాంగోవర్‌ను ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే అందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వేసుకోవాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే హ్యాంగోవర్‌ను తగ్గించుకోవచ్చు. మరి ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. నీరు


ఆల్కహాల్ వల్ల శరీరీం ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో ఒంట్లో ఉన్న నీరు అంతా పోతుంది. ఈ క్రమంలో శరీరంలో మిగిలి పోయిన వ్యర్థాలను బయటకు పంపేందుకు మనం ఇంకా ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. కనుక ఉదయం లేవగానే హ్యాంగోవర్ ఉంటే మొదట నీటిని తాగడం ప్రారంభించాలి. లేవగానే 1 లీటర్ నీటిని తాగాక రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో నీటిని బాగా తాగుతుంటే శరీరానికి నీరు అంది తద్వారా డీహైడ్రేషన్ తగ్గుతుంది. దీంతో హ్యాంగోవర్ సమస్య నుంచి కూడా బయట పడవచ్చు.

2. చక్కెర పదార్థాలు


మద్యం సేవించడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో శరీరానికి గ్లూకోజ్ సరిగ్గా అందదు. ఫలితంగా హ్యాంగోవర్ వస్తుంది. అయితే హ్యాంగోవర్ ఉన్నప్పుడు ఫ్రక్టోజ్ ఉండే పండ్లు లేదంటే గ్లూకోజ్ ఉండే చక్కెర పదార్థాలను తీసుకుంటే హ్యాంగోవర్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

3. విటమిన్ సి


హ్యాంగోవర్ ఉన్నప్పుడు నిమ్మ, నారింజ, జామ, ద్రాక్ష, కివీ, స్ట్రాబెర్రీ వంటి విటమిన్ సి ఉన్న పండ్లను తీసుకోవాలి. దీంతో హ్యాంగోవర్ పోతుంది. శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను విటమిన్ సి బయటకు పంపుతుంది. అందుకనే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

4. అరటి పండు, తేనె


అరటి పండు, తేనె, పాలు కలిపి తయారు చేసిన మిల్క్ షేక్‌ను తీసుకుంటే హ్యాంగోవర్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇవి శరీరానికి శక్తిని అందజేస్తాయి. లివర్‌ను శుద్ధి చేస్తాయి. శరీరంలో ఉండే విష పదార్థాలు పోతాయి. హ్యాంగోవర్ త్వరగా తగ్గుతుంది.

5. అల్లం


హ్యాంగోవర్ ఉన్నప్పుడు కొద్దిగా అల్లం రసంలో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఇది తలనొప్పి, వికారం, కడుపునొప్పి సమస్యలను తగ్గిస్తుంది. తద్వారా హ్యాంగోవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

6. మజ్జిగ


ఒక గ్లాస్ మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగినా హ్యాంగోవర్ సమస్య నుంచి బయట పడవచ్చు.

5959
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles