రాత్రిపూట సాక్సులు ధ‌రించి నిద్రిస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Tue,May 7, 2019 04:17 PM

నిద్ర మ‌న‌కు ఎంతో ఆవ‌శ్య‌క‌మ‌ని అంద‌రికీ తెలిసిందే. నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రిస్తేనే.. మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి త‌గ్గుతాయి. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు నిత్యం క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు అయినా నిద్రించాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డ‌మే కాదు, నిద్రించేటప్పుడు కాళ్ల‌కు సాక్సులు ధ‌రించి నిద్రించాలి. దీంతో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. కాళ్ల‌కు సాక్సులు వేసుకుని నిద్రించ‌డం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌రణ మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

2. చాలా మందికి రాత్రిపూట శరీరం నుంచి వేడిగా ఆవిర్లు వ‌స్తుంటాయి. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు రాత్రి పూట కాళ్ల‌కు సాక్సులు ధ‌రించి నిద్రిస్తే మంచిది.

3. రాత్రి పూట సాక్సుల‌ను ధ‌రించి నిద్రించ‌డం వ‌ల్ల దంప‌తులు ఆరోగ్య‌క‌ర‌మైన శృంగార జీవితాన్ని క‌లిగి ఉంటార‌ని గ్రోనిన్జెన్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

4. రాత్రి పూట కొంద‌రిలో చేతులు, కాళ్లు అతి శీత‌లంగా మారుతాయి. దీన్నే రేనాడ్స్ వ్యాధి అంటారు. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు రాత్రిపూట కాళ్ల‌కు సాక్సులు ధ‌రించి నిద్రిస్తే మంచిది.

5. రాత్రి పూట సాక్సుల‌ను ధ‌రించి నిద్రించ‌డం వ‌ల్ల పాదాలు మృదువుగా మారుతాయి. త‌ద్వారా ప‌గుళ్లు, ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

5442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles