జాస్మిన్ ఆయిల్‌తో క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Mon,April 15, 2019 01:53 PM

మ‌ల్లెపూలు ఎంత సువాస‌న‌ను ఇస్తాయో అంద‌రికీ తెలిసిందే. వాటి వాస‌న మ‌న‌స్సుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. అందుకే చాలా మంది స్త్రీలు మల్లెపూల‌ను పెట్టుకునేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. అయితే వాటి నుంచి తీసే నూనె ద్వారా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. దాన్నే జాస్మిన్ ఆయిల్ అని అంటారు. దాంతో క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. కొన్ని చుక్క‌ల జాస్మిన్ ఆయిల్‌ను కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను క‌లిపి నొప్పిగా ఉన్న కండరాల‌పై రాస్తే ఫ‌లితం ఉంటుంది. వెంట‌నే నొప్పి త‌గ్గుతుంది. అయితే ఆలివ్ ఆయిల్‌కు బ‌దులుగా వేడి నీటిని కూడా ఉప‌యోగించవ‌చ్చు. కానీ వేడి నీటితో అయితే కాప‌డంలా పెట్టాల్సి ఉంటుంది.

2. ఒకటి రెండు చుక్క‌ల జాస్మిన్ ఆయిల్‌ను శుభ్ర‌మైన వ‌స్త్రంపై వేసి దాన్ని వాస‌న చూడాలి. దీంతో ఆందోళ‌న‌, ఒత్తిడి క్ష‌ణాల్లో త‌గ్గుతాయి. మంచి మూడ్‌లోకి వ‌స్తారు. మాన‌సిక ప్ర‌శాంతత క‌లుగుతుంది.

3. కొన్ని చుక్క‌ల జాస్మిన్ ఆయిల్‌ను స్నానం చేసే నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు త‌గ్గుతాయి.

4. జాస్మిన్ ఆయిల్‌ను ఫేస్ వాష్‌లా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. కొన్ని చుక్క‌ల జాస్మిన్ ఆయిల్‌, కొబ్బ‌రినూనెలను బాగా క‌లిపి ముఖానికి మ‌ర్ద‌నా చేసి కొంత సేప‌టి త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మం మృదువుగా త‌యార‌వుతుంది.

5. జాస్మిన్ ఆయిల్‌ను వెంట్రుల‌కు నిత్యం రాస్తుంటే.. జుట్టు స‌మ‌స్య‌లు పోతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు ఉండ‌దు.

2018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles