బీన్స్ తో డ‌యాబెటిస్‌కు చెక్‌..!

Thu,March 21, 2019 09:18 AM

మ‌న‌కు ల‌భించే అధిక పోష‌కాలు ఉన్న ఆహారాల్లో బీన్స్ కూడా ఒక‌టి. కానీ వీటిని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అయితే నిజానికి వీటిని తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు తెలిస్తే వీటిని ఇక‌పై అస్స‌లు విడిచిపెట్టరు. ఎందుకంటే బీన్స్ తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. బీన్స్‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. డ‌యాబెటిస్ ఉన్న వారు త‌మ ఆహారంలో బీన్స్‌ను చేర్చుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

2. బీన్స్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వాటిని తింటే జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి త‌గ్గుతాయి.

3. చికెన్‌, మ‌ట‌న్‌, కోడిగుడ్లు తిన‌లేమ‌ని అనుకునే వారు బీన్స్‌ను తిన‌డం మంచిది. ఎందుకంటే ఆయా నాన్‌వెజ్ ఆహారాల‌కు స‌మానంగా ప్రోటీన్లు బీన్స్‌లో ఉంటాయి. అందువ‌ల్ల వాటిని తిన‌ని వారు బీన్స్‌ను తింటే శ‌రీరానికి ప్రోటీన్లు అందుతాయి. త‌ద్వారా ప్రోటీన్ల లోపం లేకుండా చూసుకోవ‌చ్చు.

4. అధిక బ‌రువు ఉన్న‌వారు త‌ర‌చూ బీన్స్‌ను తింటుంటే శ‌రీరంలో ఉండే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

5. బీన్స్‌లో ఉండే విట‌మిన్ సి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. అలాగే వెంట్రుక‌లు, చ‌ర్మ స‌మస్య‌లు రాకుండా చూస్తుంది.

2543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles