వంకాయలతో బోలెడు ఆరోగ్యకర ప్రయోజనాలు..!


Sun,August 19, 2018 12:53 PM

ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి.. అనే ఓ సినిమా పాట గుర్తుంది కదా. అవును, నిజంగా వంకాయతో చేసుకునే కూరల రుచి అలాగే ఉంటుంది. అయితే అద్భుతమైన రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ వంకాయలు ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. వంకాయల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తరచూ వంకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వంకాయల్లో ఆంథోసయనిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వంకాయల్లో ఉండే నాసునిన్ అనే సమ్మేళనం మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేయగలుగుతారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

2. వంకాయల్లో ఉండే విత్తనాల్లోనూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విత్తనాలను తింటే మన శరీరంలో జీర్ణవ్యవస్థ, మూత్రాశయ వ్యవస్థ చక్కగా పనిచేస్తాయి.

3. వంకాయల్లో పాస్ఫరస్, కాల్షియం, విటమిన్ బి1, బి2, బి3, బి6, ప్రోటీన్లు, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం, ఫోలేట్, విటమిన్ కె తదితర అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి.

4. వంకాయలను తరచూ తినడం వల్ల గుండె పోటు రాకుండా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మధుమేహం అదుపులోకి వస్తుంది.

5. అధిక బరువును తగ్గించుకునేందుకు కూడా వంకాయలు మేలు చేస్తాయి. క్యాన్సర్ వంటి ప్రమాకరమైన వ్యాధుల బారి నుంచి రక్షించే గుణాలు వంకాయల్లో ఉంటాయి.

7389

More News

VIRAL NEWS