ప‌ల్లీల‌ను పొట్టుతో స‌హా తినాల్సిందే.. ఎందుకంటే..?

Mon,March 18, 2019 04:22 PM

మ‌నలో చాలా మంది పల్లీల‌తో ప‌లు ర‌కాల వంట‌కాలు చేసుకుని తింటుంటారు. కొంద‌రు వాటితో స్వీట్లు చేసుకుని తింటే.. కొంద‌రు చ‌ట్నీలు, కూర‌లు చేసుకుంటారు. అయితే ఏ విధంగా తిన్నా స‌రే.. ప‌ల్లీల‌తో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కానీ కొంద‌రు ప‌ల్లీల‌ను పొట్టు తీసేసి తింటుంటారు. అలా చేయ‌రాదు. నిజానికి ఆ పొట్టులోనూ మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాలు ఉంటాయి. ప‌ల్లీల పొట్టు తిన‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. ప‌ల్లీల‌ను పొట్టుతో స‌హా తింటే.. ఆ పొట్టులో ఉండే బ‌యోయాక్టివ్స్‌, ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చేస్తాయి.

2. ప‌ల్లీల పొట్టులో ఉండే పాలీఫినాల్ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. చ‌ర్మం ఎండిపోకుండా మృదువుగా ఉంచుతుంది.

3. ప‌ల్లీల‌ను పొట్టుతో స‌హా తింటే అధిక బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

4. ప‌ల్లీల‌ను పొట్టుతో తింటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

5. శ‌రీరంలో పేరుకుపోయే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

5504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles