రోజూ యాలకుల‌ను తింటే.. కలిగే అద్భుతమైన లాభాలివే తెలుసా..?


Sun,February 25, 2018 02:01 PM

భారతీయులు తమ వంటల్లో యాలకులను ఎక్కువగా వేస్తారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఎన్నో శతాబ్దాలుగా యాలకులను మనం వంటల్లో ఉపయోగిస్తున్నాం. అయితే మీకు తెలుసా..? కేవలం వంటలకే కాదు, అనారోగ్య సమస్యలను నయం చేయడంలోనూ యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. అవును, మీరు విన్నది కరెక్టే. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రోజూ 3 సార్లు భోజనం చేసినప్పుడల్లా ఒక యాలక్కాయను నమిలి అలాగే తింటే దాంతో ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. యాలకులను రోజూ తినడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.

2. జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఆకలి బాగా వేస్తుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం సమస్యలు ఉండవు.

3. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం ఎక్కువగా తయారవుతుంది.

4. శరీరంలో పేరుకుపోయే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.

5. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

నోట్: యాలకులను తినడం మంచిదే అయినా వాటిని మోతాదుకు మించి తినరాదు. ఒక వేళ అలా తింటే ఛాతిలో అసౌకర్యంగా ఉంటుంది. ఛాతి నొప్పి రావచ్చు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. యాలకులను ఎక్కువగా తీసుకుంటే గాల్ స్టోన్స్ వస్తాయి. హెచ్‌ఐవీ మందులు వాడేవారు, యాంటీ కాగ్యులెంట్స్, లివర్ వ్యాధులకు, డిప్రెషన్‌కు మందులు తీసుకునేవారు, ఆస్పిరిన్ వాడేవారు, ప్లేట్‌లెట్లు పెరిగేందుకు, గాల్ స్టోన్ మెడిసిన్స్ వాడేవారు, ఐబీఎస్ మందులు వాడే వారు యాలకులను తినకపోవడమే మంచిది.

13384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles