మిరియాల టీని రోజూ తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?


Mon,January 22, 2018 03:11 PM

ఘాటైన వాసన, కారం రుచి కలిగి ఉండే నల్ల మిరియాలను మనం ఎక్కువగా ప‌లు వంటల్లో వేస్తుంటాం. ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌ల్లో మిరియాల పొడిని ఎక్కువ‌గా వాడుతారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వాస్తుంది. అయితే మిరియాల‌ను కేవ‌లం వంట‌ల్లోనే కాదు, వాటితో టీ త‌యారు చేసుకుని తాగినా చ‌క్క‌ని టేస్ట్ మ‌న‌కు ల‌భిస్తుంది. నిత్యం మ‌నం తాగే టీలో న‌ల్ల మిరియాల పొడి వేసి మ‌రిగిస్తే చాలు, దాంతో మిరియాల టీ రెడీ అవుతుంది. ఈ క్ర‌మంలో ఆ టీ తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ప‌లు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా క‌లుగుతాయి. మ‌రి ఆ టీ వల్ల మనకు కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా.

1. అధిక బరువును తగ్గించుకునేందుకు నల్ల మిరియాల టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. శరీర బరువును తగ్గించడంలో ఈ టీ అమోఘంగా పనిచేస్తుందని తాజాగా చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కొవ్వును కరిగించే గుణాలు ఇందులో ఉన్నాయి. బరువు తగ్గాలనే ప్రణాళికలను పాటించే వారు తమ ఆహారంలో మిరియాల టీని భాగం చేసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ఇది ఘాటైన వాసన కలిగి ఉండి ఆకలిని నియంత్రిస్తుంది.

2. కొవ్వు పదార్థాలని జీర్ణం చేయడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. జీవ క్రియలు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.

3. దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కండరాల నొప్పులను తగ్గిస్తుంది. దంత వ్యాధులు రాకుండా చూస్తుంది. డయేరియా, గుండె జబ్బులకు విరోధిగా పనిచేస్తుంది.

4. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. రోగ నిరోధక వ్యవస్థను గాడిలో పెడుతుంది. క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉన్నాయి.

5. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ సి మిరియాల టీలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో నిత్యం ఏర్పడే ఒత్తిడిని తగ్గించి దేహానికి విశ్రాంతినివ్వడంలో ఇది అమోఘంగా పనిచేస్తుంది. రక్తహీనతను నివారించడంతోపాటు చర్మాన్ని సంరక్షిస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

గ‌మ‌నిక‌: జీర్ణాశయ సంబంధమైన శస్త్ర చికిత్సలు జరిగిన వారు మిరియాలను వాడ‌కూడ‌దు. ఎందుకంటే ఇది వారి పేగుల్లో ఇబ్బందులను సృష్టిస్తుంది. కొంత మందిలో అలర్జీ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

8009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles