అధికబ‌రువును త‌గ్గించే... 5 సూత్రాలు..!

Mon,March 11, 2019 12:29 PM

అధిక బ‌రువు త‌గ్గ‌డం కోసం నేటి త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్నారు. వ్యాయామం చేయ‌డం, ప‌లు ర‌కాల డైట్‌ల‌ను పాటించ‌డం, పోష‌కాహారం, మందుల‌ను తీసుకోవ‌డం చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం బ‌రువు త‌గ్గ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన విధంగా ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో అధిక బ‌రువును చాలా తేలిగ్గా త‌గ్గించుకోవ‌చ్చు. మరి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1. నిత్యం 30 నిమిషాలు పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు క‌చ్చితంగా త‌గ్గుతార‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి నిత్యం చ‌క్క‌ని వ్యాయామం జ‌రుగుతుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అలాగే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

2. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది.

3. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటుంటే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఫ‌లితంగా తీసుకునే ఆహార ప‌రిమాణం త‌గ్గుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు.

4. నిత్యం త‌గినంత నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువు త‌గ్గుతారు.

5. మ‌న శ‌రీరానికి త‌గినంత నిద్ర కూడా రోజూ అవ‌స‌ర‌మే. రోజూ త‌గినన్ని గంట‌ల పాటు నిద్రించ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

5372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles