ఆదివారం 17 జనవరి 2021
Health - Dec 01, 2020 , 21:03:23

ఆరోగ్యకరమైన దంతాల కోసం 5 చిట్కాలు

ఆరోగ్యకరమైన దంతాల కోసం 5 చిట్కాలు

హైద‌రాబాద్ : మనిషిని చూడగానే కనిపించేది చిరునవ్వు. చిన్న నవ్వుతో యుద్ధాలను సైతం ఆపేయచ్చు అటుంటారు. కానీ చాలా  దంతాలు తెల్లగా లేవని.. ఎవరు చూసి ఏమనుకుంటారో అని బాధపడుతుంటారు. అందరిలో నవ్వటానికి ఇబ్బంది పడుతుంటారు. నిజానికి అలాంటి వారు పళ్లను తెల్లగా మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు. ఇప్పటికే తెల్లటి దంతాల కోసం.. బేకింగ్ సోడా, నిమ్మకాయ, ఉప్పు, నారింజ తొక్క, అరటి తొక్క లాంటివి వాడి  విసిగిపోయిన వారికి.. ఇక్కడ కొన్ని సహజమైన చిట్కాలు ఉన్నాయి. దీనికోసం మీకు కావాల్సింది ఓపిక, ఇంకా రాత్రంతా వీటిని రాసుకుని ఉండే వెసులుబాటు. ఇక ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందామా..

1. ఆయిల్ పుల్లింగ్

నోట్లో కొబ్బరినూనె/సెసెమె ఆయిల్ పోసుకుని పుక్కిలించడాన్ని ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల దంతాలు, చిగుళ్లలో ఉన్న మోక్రోబ్స్ తొలగిపోతాయి. ఇది నోటిలోని పూతను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు.. నోట్లోని కండరాలకు వ్యాయామంలా పనిచేసి.. బలంగా తయారవుతాయి. ఇలా నోట్లో నూనె పోసుకుని దాదాపు 15 నుంచి 20నిమిషాలు పుక్కిలించడం వల్ల దంతాలు తెల్లగా ఆరోగ్యంగా మారతాయి. 

2. వేప/తుమ్మ కొమ్మలతో పళ్లు తోముకోవడం

వేప లేదా తుమ్మ కొమ్మలతో పళ్లు తోముకోవడం వల్ల నోట్లోని క్రిములు నాశనమవుతాయి. వీటిలో సహజంగా ఉండే యాంటీ-మెక్రోబయల్, యాంటీ-బ్యాక్టీరియల్ ఏజెంట్లు నోటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు దంతాలు తెల్లగా అందంగా కనపడేలా చేస్తాయి.

3. నాలుక గీసుకోవడం

నాలుకపై పేరుకుపోయిన ఆహార పదార్థాల ఫలకాన్ని శుభ్రం చేసుకునేందుకు నాలుక గీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల దంతాలో క్యావిటీలు, టాక్సిన్స్ తొలగిపోయి.. నాలుకపై బ్యాక్టీరియా పేరుకోకుండా ఉంటుంది.

4. మూలికలతో నోరు శుభ్రం చేసుకోండి

 త్రిఫల, యష్టిమధు లాంటి ఆయుర్వేద మూలికలతో చేసుకున్న డికాషన్ తాగడం వల్ల మీ నోరు అన్నివేళలా పరిశుభ్రంగా ఉంటుంది. ఇది ఓరల్ హైజిన్ ను పెంపొందించి దంత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

5. రోజుకి రెండు సార్లు పళ్లు తోమడం

ఎంత అలసిపోయినప్పటికీ రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా పళ్లలో ఇరుక్కుపోయి ఉండే తీపి పదార్థాలు, చాకొలెట్లు వంటివి తిన్నప్పుడు పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల దంతాలు అందంగా, ఆరోగ్యంగా మారతాయి.