అధిక బ‌రువు త‌గ్గాలా..? ఈ ప్రోటీన్ ఆహారాల‌ను తీసుకోండి..!


Thu,December 27, 2018 01:19 PM

ఏ వ్య‌క్తి అయినా ఆరోగ్య‌క‌రంగా ఉండాలంటే ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న విధానాన్ని క‌లిగి ఉండ‌డంతోపాటు బ‌రువును కూడా అదుపులో ఉంచుకోవాలి. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటే గుండె జ‌బ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే అధిక బ‌రువు ఉన్న‌వారు మాత్రం ఈ వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే బ‌రువును త‌గ్గించుకోవాలి. అందుకు గాను ప్రోటీన్లు ఉన్న ఆహారాలు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డ‌తాయి. ప్రోటీన్లు ఉన్న ఆహారాల‌ను తీసుకుంటే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల ఎప్పుడు ప‌డితే అప్పుడు, ఏది ప‌డితే అది తిన‌కుండా ఉంటారు. అలాగే శ‌రీర మెట‌బాలిజం కూడా పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌యి కొవ్వు క‌రుగుతుంది. అలాగే కండ‌రాలు, ఎముక‌లు సుర‌క్షితంగా కూడా ఉంటాయి. మ‌రి అధిక బ‌రువును తగ్గించే ఉత్త‌మ‌మైన ప్రోటీన్ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కోడిగుడ్లు


కోడిగుడ్లలో ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అమైనో యాసిడ్లు గుడ్ల‌లో ఉంటాయి. ఇవి బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. కనుక నిత్యం ఆహారంలో కోడిగుడ్ల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి.

2. చికెన్


చికెన్ లెగ్ పీస్‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ దాని క‌న్నా చికెన్ బ్రెస్ట్ పీస్‌ల‌లోనే ప్రోటీన్లు మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. నిత్యం వ్యాయామం చేసేవారు, బాడీ బిల్డింగ్ చేసేవారు చికెన్ బ్రెస్ట్‌నే ఎక్కువగా తింటారు. ఇక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు కూడా చికెన్ లెగ్ పీస్‌లు కాకుండా, చికెన్ బ్రెస్ట్ పీస్‌ల‌ను తినాలి. దీంతో బ‌రువు అదుపులో ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు ల‌భిస్తాయి. క్యాల‌రీలు పెర‌గ‌కుండా ఉంటాయి.

3. చీజ్


ప‌ర్మేష‌న్‌, రొమానో, గ్రుయెరె త‌దిత‌ర చీజ్ వెరైటీల‌లో మ‌న‌కు ప్రోటీన్లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. చీజ్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ప్రోటీన్ల‌తోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు కూడా మ‌న‌కు అందుతాయి. సాయంత్రం స్నాక్స్ రూపంలో చీజ్‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. దీంతో బ‌రువు త‌గ్గ‌డం తేలిక‌వుతుంది.

4. చేప‌లు


చేప‌ల్లో ప్రోటీన్లు ఎక్కువ‌గా, ఫ్యాట్ త‌క్కువగా ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేప‌ల్లో ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి. మెద‌డు ప‌నితీరును పెంచుతాయి. అలాగే కీళ్ల వ‌ద్ద వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీంతోపాటు బ‌రువును అదుపులో ఉంచుతాయి.

5. బాదంప‌ప్పు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, ఓట్ మీల్


బాదం ప‌ప్పు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, ఓట్ మీల్‌ల‌లోనూ ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. బాదంప‌ప్పులో ఉండే విట‌మిన్ ఇ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే గుమ్మ‌డి కాయ విత్త‌నాల్లో ఉండే ఐర‌న్‌, మెగ్నిషియం, ప్రోటీన్లు మ‌న శ‌రీర బ‌రువును అదుపులో ఉంచేందుకు స‌హాయ ప‌డతాయి. ఓట్ మీల్‌లో ఉండే ప్రోటీన్లు, ఫైబ‌ర్ ఆక‌లిని నియంత్రిస్తాయి. క్యాల‌రీలు చేర‌కుండా చూస్తాయి.

5813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles