మొటిమ‌ల‌ను తొల‌గించే ఎఫెక్టివ్ టిప్స్


Thu,November 15, 2018 02:46 PM

యువ‌తీ యువ‌కులు ఎదుర్కొనే ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో మొటిమ‌ల స‌మ‌స్య కూడా ఒక‌టి. మొటిమ‌ల‌ను పోగొట్టుకునేందుకు వారు అనేక ర‌కాల క్రీములు వాడుతుంటారు. దీంతో స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌వుతుంది. అయితే అలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా కింద సూచించిన ప‌లు టిప్స్ పాటిస్తే దాంతో మొటిమ‌ల స‌మ‌స్య‌ను సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే...

1. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయ‌డం వల్ల ముఖంపై చ‌ర్మ రంధ్రాల్లో దుమ్ము పేరుకుపోకుండా ఉంటుంది.

2. వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.

3. ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

4. శొంఠి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారు చేసి ముఖంపై తరుచూ రాస్తూ ఉంటే మొటిమలు తక్షణమే తగ్గుముఖం పడతాయి.

5. మొటిమ గనక చితికినట్లయితే దానిమీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన ర‌సి అంతా వచ్చేస్తుంది. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.

1960

More News

VIRAL NEWS

Featured Articles