చలికాలంలో చుండ్రుకు చెక్ పెట్టండిలా..!


Wed,December 5, 2018 05:10 PM

చలికాలంలో సహజంగానే చాలా మందిని చుండ్రు సమస్య బాధిస్తుంటుంది. తలపై ఉండే వెంట్రుకల కుదుళ్ల వద్ద నుంచి చర్మం పొట్టులా మారి పైకి వస్తుంది. దీంతోపాటు చర్మం పగలడం వల్ల కూడా చుండ్రు వస్తుంటుంది. అయితే కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే చలికాలంలో చుండ్రు సమస్య నుంచి చాలా సులభంగా తప్పించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే...

1. ఉల్లిపాయలను కట్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని తలకు పట్టించి 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

2. మెంతులను రాత్రంతా నీళ్లలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పేస్ట్‌లా చేయాలి. దాన్ని తలకు పట్టించి కొంత సేపు అయ్యాక స్నానం చేయాలి. చుండ్రును త్వరగా తగ్గించుకోవాలంటే ఈ చిట్కాను పాటిస్తే ఫలితం ఉంటుంది.

3. ఉల్లిపాయల రసం, కలబంద రసంలను సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి.

4. బీట్‌రూట్, ఉల్లిపాయ రసాలను సమభాగాలుగా తీసుకుని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని తలకు పట్టించి కొంత సేపు అయ్యాక స్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే తప్పక చుండ్రు తగ్గుతుంది.

5. తేనె, ఉల్లిపాయ రసంలను మిశ్రమంగా చేసి తలకు పట్టించాలి. 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

2369

More News

VIRAL NEWS