ఆస్తమాను తగ్గించే ఇంటి చిట్కాలు..!


Sat,September 15, 2018 04:50 PM

ఆస్తమా అనేది జన్యుపరమైన, పర్యావరణ పరమైన కారణాల వల్ల వస్తుంది. ఆస్తమా వచ్చిన వారి ఊపిరితిత్తుల్లో గాలి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో దగ్గు, గురక వస్తుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే దీనికి డాక్టర్‌ను కలిసి సరైన చికిత్స తీసుకోవాలి. దీంతోపాటు కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే ఆస్తమా నుంచి సమర్థవంతంగా ఉపశమనం పొందవచ్చు. మరి ఆస్తమాను తగ్గించే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఒక గ్లాస్ పాలలో ఒకటి, రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మరిగించి అనంతరం ఆ పాలను తాగాలి. దీంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. నిత్యం తాగే టీలో అల్లం, వెల్లుల్లి రసాలను సమాన పరిమాణంలో వేసి టీ తాగితే ఆస్తమా నుంచి బయట పడొచ్చు.

3. నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగుతుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.

4. రాత్రి పూట ఒక గిన్నెలో కొన్ని నీరు పోసి అందులో కొన్ని మెంతులను వేసి నానబెట్టాలి. వాటిని మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున తినాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తే ఆస్తమా నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా శ్వాస సరిగ్గా ఆడుతుంది. అలాగే పలు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి.

5. తులసి ఆకులను కొన్నింటిని నిత్యం ఉదయాన్నే పరగడుపునే తింటున్నా లేదంటే తులసి ఆకులతో చేసిన టీని తాగుతున్నా ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజూ క్రమం తప్పకుండా కాఫీ తాగితే అందులో ఉండే ఔషధ గుణాలు శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తాయి. ఆస్తమా నుంచి బయట పడవచ్చు.

4976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles