గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Feb 10, 2020 , 17:45:42

రోజూ పెరుగు తింటే జీర్ణ స‌మ‌స్య‌లు దూరం..!

 రోజూ పెరుగు తింటే జీర్ణ స‌మ‌స్య‌లు దూరం..!

మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ఆహార ప‌దార్థాల్లో పెరుగు కూడా ఒక‌టి. పెరుగును వేస‌విలో తింటే మ‌న‌కు ఎంతో లాభం క‌లుగుతుంది. ముఖ్యంగా శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ క్ర‌మంలోనే పెరుగును ఈ సీజ‌న్‌లో రోజూ తింటే మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. పెరుగును రోజూ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మస్య‌లు ఉండ‌వు. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. క‌డుపులో మంట త‌గ్గుతుంది.

2. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌మ ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాలి.

3. పెరుగు తినడం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

4. క్యాన్స‌ర్ల‌ను అడ్డుకునే శ‌క్తి పెరుగులోని ఔష‌ధ గుణాల‌కు ఉంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

5. పెరుగును రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.


logo